Headlines
BRS MLA MAGANTI GOPINATH DIED

జూబిలీహిల్స్ BRS ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు ఇక లేరు.

జూబిలీహిల్స్ BRS ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు మృతి :

తెలంగాణలో జూబిలీహిల్స్ నియోజకవర్గానికి చెందిన BRS ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు తుది శ్వాసను విడిచారు. మాగంటి గోపినాథ్ గారు గత కొన్ని రోజుల గా ఆరోగ్య సమస్య తో గచ్చిబౌలి AIG హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా జూన్ 8 2025 ఉదయం 5.45 నిమిషాలకు గుండె పోటుతో మృతి చెందారు. గత సంవత్సరంగా గోపినాథ్ గారు అనారోగ్య సమస్యలు కారణంగా AIG హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు,కిడ్నీ సమస్య కూడా ఉండడం తో డయాలసిస్ కూడా తీస్కుంటున్నారు. ఈ సమయం లోనే వారికీ హార్ట్ ఎటాక్ రావడం తో చనిపోయారు.

మాగంటి గోపినాథ్ గారు 1963 జూన్ 2 న హైదర్‌గూడ లో కృష్ణమూర్తి, మహానంద కుమారి గార్లకి జన్మించారు. 1980 లో ఇంటర్మీడియట్, 1983 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. గోపినాథ్ గారికి సునీత గారితో వివాహామైయింది. వారికీ ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు. ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన రోజుల్లో తెలుగు దేశం పార్టీ లోఆయన రాజకీయ ప్రస్థానం మొదలయింది. 1985 నుంచి 1992 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి తెలుగు యువత అధ్యక్షులు గా ఉన్నారు. 1987 నుంచి 1988 వరకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ గా పనులు చేపట్టారు. 2014 లో మొట్ట మొదటి సారి టీడీపీ ఎమ్మెల్యే అయ్యారు. తరువాత 2018 మరియు 2023 లో బీఆర్ఎస్ ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యే హోదా లో ఉన్నారు, గోపినాథ్ గారి మరణం బీఆర్ఎస్ కి తీరని లోటు.

చాల చిన్న వయసు లో రాజకీయం లో కి అడుగు పెట్టిన గోపినాథ్ గారికి చాల మంది తో మంచి అనుబంధం ఉంది రాజకీయాల్లో మంచి పేరు ఉంది, జూబిలీ హిల్స్ నియోజకవర్గం లో ఉన్న ఆయన బస్తి లో ఉన్న ప్రజలకి ఏ లోటు లేకుండా అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకున్నారు, బస్తి లో ఉన్న నీటి కొరత ను గుర్తించి వారికి నీటి సదుపాయాలని ఇచ్చారు. మాస్ లీడర్ గా గుర్తింపు తెచుకున్నారు, కేటీఆర్ కి సన్నిహితుడు గా, కేసీఆర్ కి శిష్యుడు గా రాజకీయాలో వారికంటూ చెరగని ముద్ర వేసుకున్నారు.

గోపినాథ్ గారి మరణ వార్త విని సీఎం రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి ని ప్రకటించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని తెలిపారు. గోపినాథ్ మృతదేహాన్ని చూడగానే కన్నీరు పెట్టుకున్న మాజీ సీఎం కేసీఆర్, వారి కుటుంబాన్ని పరామర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి గారు గోపినాథ్ గారి అంత్యక్రియల బాధ్యత అంత ప్రభుత్వమే చేపడుతుంది అని చెప్పారు. వారి అంతిమ యాత్ర లో కేటీఆర్ మరియు హరీష్ రావు గారు స్వయంగా  వారి పాడె ను మోసి నివాళులు అర్పించ్చారు. మధ్యాహ్నం 3 – 4 గంటలకు జూబిలీ హిల్స్ మహాప్రస్థానం వద్ద ఏర్పాటు చేసారు భౌతిక దేహాన్ని మాదాపూర్ నివాసం నుంచి ర్యాలీ చేస్తూ మహాప్రస్థానం వరకు తరలించారు. అంత్యక్రియలు కార్యక్రమం లో పోలీస్ లు గౌరవ వందనాలు మూడు రౌండ్లు కాల్పులు ఘనంగా పేల్చారు.