Headlines
KCR LATEST

ఘనం గా నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడుక

వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు  భారీగా తరలి వచ్చారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ నిర్వహించిన రజతోత్సవ సభకు ఊహించిన దాని కన్నా అధిక సంఖ్యలో  మండుటి ఎండ ని సైతం లేక్క చేయ్యకుండా తరలి వచ్చిన పార్టీ  కార్యకర్తలు, అభిమానులు.

రజతోత్సవ సభలో సమ్మక్క సారక్క జాతరను తలపించేల జన సందోహం. బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పెట్టించిన బస్సులే కాకా పాదయాత్ర గా ఎడ్లబండ్లలో, ప్రైవేట్ వాహనాలు, బస్సులు, డిసిఎంలు, కారులోనే కాక ఆటో, బైక్ ర్యాలీలు గా తరలి వచ్చిన పార్టీ అభిమానులు. పలు చోట్ల రజతోత్సవ సభకు వచ్చే వాహనాలను అక్కడికక్కాడే అడ్డుకున్న పోలీసులు.

BRS RAJATOTHSAVAM

ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్ చేరుకునే వరకు ఇంకా ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని ఉన్న లక్షలాది జనం.

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కెసిఆర్ గారు ప్రసంగం మొదలు పెట్టే ముందు పహాల్గమ్ దాడి లో మరణించిన వారికోసం రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

తరువాత గడచిన ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు చేసింది ఏమి లేదు.ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు విల్లన్ నో 1 కాంగ్రెస్ పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీ పై విరుచుక పడ్డారు.

ఇచ్చిన హామీలు రైతు బందు, పెన్షన్లు, మహిళలకు ఇస్తాం అన్న 2000, దివ్యంగుల ఇస్తాం అన్న 6000 పెన్షను, చదువుకునే విద్యార్థులకు ఇస్తాం అన్న 5 లక్షల బ్యాంకు కార్డు, కళ్యాణ్ లక్ష్మి లో ఇస్తాము అన్న తులం బంగారం ఇలాంటివి 420 హామీలు ఇచ్చారు అని చెప్పుకొచ్చారు.

మిషన్ భగీరథ పేరిట ఇంటి ఇంటికి నల్లాలు పెట్టి నీళ్లందిస్తే ఆ పథకం కూడా ఆపేసారు.ఆనాడు మేము జేసీబీలు పెట్టి చెరువుల్లో పూడికలు తీపిస్తే ఈనాడు అదే జేసీబీల తో హైడ్రా పేరిట పేదల ఇల్లులని కూలగొట్టారు అని కేసీఆర్ అన్నారు.

ఇచ్చిన హామీలు పక్కన పెట్టి  ప్రజలని ఇబ్బంది పెట్టే అనవసరమైన పనులు అంటూ హైడ్రా, హ్ సి యూ ,మూసి ప్రస్థానాలు గూర్చి మాటాడారు .

ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాం లో సీఎం రాజశేఖర్ గారు ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ప్రజలకి మేలు చేసేల ఉందని దాన్ని అలాగే కొనసాగించుతాం అని అసెంబ్లీ లో చెప్పారని చెప్పుకొచ్చారు.

కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి బీఆర్‌ఎస్‌ పార్టీ హయాం లో ప్రవేశపెట్టిన ఎన్నో మంచి పథకాలను కావాలని పక్కన పెట్టారు  అని భావోద్వేగానికి గురయ్యారు.

కేంద్రం లో బిజేపి ఆధికారం లో 11 సంవత్సరాలు అయినప్పటికీ తెలంగాణ కి 11 రూపాయలు కూడా ఇవ్వలేదు అన్నారు. తెలంగాణ కి ఒక మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు అన్నారు.

అయితే కేసీఆర్ ప్రసంగిస్తున్నంత  సేపు సీఎం, సీఎం అంటూ అభిమానులు గోల చేస్తుంటే గాడిదలకు గడ్డి వేసి బర్రెల కి పాలు పిండితే వస్తాయా, హైడ్రా బాధితుడు కేసీఆర్  అంటుంటే కత్తి వాని చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేయ్యమంటే ఎలా అని అన్నారు.

మేము ఏమి కాంగ్రెస్ ప్రభుత్వం ని కూల్చేది లేదు 3 సంవత్సరాలు వాళ్లే అధికారం లో ఉండాలి ప్రజలకి ఇచ్చిన హామీలు ప్రతీది చేయాలి చేసే దాకా ఊరుకునేది లేదు అని చెప్పారు.

సక్కగా పని చేయకపోతే ప్రజలే వాళ్ళ వీపు ని సాఫ్ చేస్తారని  ప్రతి పక్ష హోదా లో మేము చేసే పనిని చేసి చూపిస్తాం అన్నారు.