Headlines
indian army revnge

ఆపరేషన్ సిందూర్: పహాల్గమ్ దాడికి భారత్ ప్రతీకారం

ఆపరేషన్ సిందూర్ ప్రారంభం:

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ని చేపట్టింది. పహాల్గమ్ దాడికి భారత్ ప్రతీకారంగా ఈ ఆపరేషన్‌ను అర్ధరాత్రి 1:44 గంటలకు ప్రారంభించారు. భారత వైమానిక దళం పాకిస్తాన్ మరియు పీవోకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను గుర్తించి, మిస్సైల్స్‌తో మెరుపు దాడులు చేసింది.

లక్ష్యంగా ఉగ్రవాద స్థావరాలు

ఈ దాడుల్లో ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్ స్థావరం మురిడ్కేతో పాటు ముజాఫరాబాద్‌లోని రెండు ప్రాంతాలు, కోట్లి, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్, చకంబ్రు, బహవల్పూర్‌లలోని ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేశారు. భారత ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం సంయుక్తంగా ఈ దాడులను నిర్వహించాయి.

operation sindhoor

ప్రధాని మోదీ పర్యవేక్షణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆపరేషన్‌ను రాత్రంతా పర్యవేక్షించారు. 9 ఉగ్రవాద స్థావరాలు విజయవంతంగా ధ్వంసం కావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు “భారత్ మాతాకీ జై” అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

దేశవ్యాప్త హర్షం

పహాల్గమ్ దాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌కు జమ్మూ కాశ్మీర్‌తో సహా దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ దాడులు కేవలం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నాయని, పాకిస్తాన్ పౌరులకు ఎలాంటి హాని జరగలేదని భారత్ అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా వంటి ప్రధాన దేశాలకు తెలియజేసింది.

అమెరికా హెచ్చరిక

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మార్కో రుబియో పాకిస్తాన్‌కు హెచ్చరిక జారీ చేశారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉందని, ఆపరేషన్ సిందూర్ ‌పై పాకిస్తాన్ మౌనంగా ఉండటం మంచిదని, భారత్‌పై యుద్ధానికి ధైర్యం చేయవద్దని సూచించారు.

ఐక్యరాజ్య సమితి ఆందోళన

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, పాకిస్తాన్ యుద్ధానికి దిగకుండా సంయమనం పాటించాలని కోరారు.

వివరాల ప్రకటన

ఆపరేషన్  సిందూర్ ‌కు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం ఉదయం 11 గంటలకు ప్రకటించే అవకాశం ఉంది.

ఎందుకు ఆపరేషన్ సిందూర్ ముఖ్యం ?

ఆపరేషన్ సిందూర్ భారత్ యొక్క ఉగ్రవాద వ్యతిరేక నిబద్ధతను ప్రపంచానికి చాటింది. ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం తమ సామర్థ్యాన్ని, దేశ భద్రత పట్ల తమ దృఢ సంకల్పాన్ని మరోసారి నిరూపించింది.

పహల్గం ఉగ్ర దాడి కోసం పూర్తి వివరాలు తెలుసుకోడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

Permalink: https://telandra.com/politics/పహల్గామ్-ఉగ్రదాడి-భారత-హ/