America Trade Deal

అమెరికాతో డీల్: చమురు నిషేధం కొనసాగుతుంది.

అమెరికాతో ట్రేడ్ డీల్‌పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చల తర్వాత కుదిరిన ఈ ఒప్పందం నేపథ్యంలో పలు అంశాలపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కీలక వివరణ చేసింది.

నిషేధిత దేశాల నుంచి ముడి చమురు కొనుగోలు చేయబోమని కేంద్రం గట్టిగా పేర్కొంది. ముఖ్యంగా వెనిజులా నుంచి చమురు దిగుమతి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అమెరికా వైపు నుంచి వచ్చిన కొన్ని ప్రకటనలు, ట్రేడ్ డీల్‌లో భాగంగా వెనిజులా చమురుకు మార్పు జరుగుతుందన్న అంచనాలను కేంద్రం తోసిపుచ్చింది. ఆంక్షలు ఎత్తివేసినా భారత్ తన విధానంలో మార్పు చేసుకోదని తేల్చి చెప్పింది.

Central

అలాగే, రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని కేంద్రం దృఢంగా ప్రకటించింది. వ్యవసాయ రంగం, డైరీ సహా సున్నితమైన రంగాలను ఈ ఒప్పందంలో చేర్చలేదని, రైతుల హితాలకు ఎలాంటి భంగం రాదని ఉన్నత వర్గాలు స్పష్టం చేశాయి. భారత రైతాంగానికి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపింది.

Trade Deal

ఈ ట్రేడ్ డీల్ ద్వారా అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గుతాయని, భారత ఎగుమతులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని అంచనా. అయితే, దేశ ఆర్థిక భద్రత, రైతుల హక్కులు, ఇంధన విధానంపై కేంద్రం స్థిరమైన వైఖరి అవలంబిస్తోంది. ఈ స్పష్టతతో దేశ ప్రజల్లో ఉన్న సందేహాలు తొలగుతాయని భావిస్తున్నారు.