Headlines
fast tag announcement

ఫాస్ట్ టాగ్ పై కేంద్రం నుంచి శుభవార్త- నితిన్ గడ్కరీ

ఫాస్ట్ టాగ్ పై కేంద్రం నుంచి కొత్త ఆఫర్ :

కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వాహన దారులకి శుభవార్త చెప్పింది మినిస్టర్ అఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అఫ్ ఇండియా మినిస్టర్ నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేసారు. 2025 ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం కానుకగా కొత్త ఫాస్ట్ ట్యాగ్ ప్లాన్ ని ప్రవేశ పెట్టనున్నారు . ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత వార్షిక ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో వాహన దారులు ౩౦౦౦ రూ తో రీఛార్జ్ చేసుకుంటే 200 ట్రిప్పుల లేదా ఒక సంవత్సరం వరకు దేశంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చని తెలిపింది. అయితే ఈ ప్లాన్ నాన్-కమర్షియల్ ప్రైవేట్ వెహికల్స్ కార్స్, జీప్స్, మరియు వాన్స్ కి మాత్రమే వర్తిస్తుంది.

FAST TAG TOLL PLAZA

అయితే చాల మంది వాహనదారులకు ఒక చిన్న సందేహం ఉంటుంది 200 అంటే ఎలా చూస్తారు. ప్రయాణ మొదలు నుంచి చివరి వరకు అని అనుకోవచ్చు కానీ అలా కాదు. ఉదాహరణ కి మీరు మీ కార్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రయాణిస్తున్నారు అనుకోండి. ఆ ప్రయాణం లో మీకు మొత్తం 5 టోల్ గేట్ లు వచ్చాయి అనుకుందాం. మీరు ఎన్ని అయితే టోల్ గేట్ లు దాటుతారో అన్ని ట్రిప్స్ గా పరిగణిస్తారు. మీరు ఈ వార్షిక ప్లాన్ తీసుకున్నట్టు అయితే మీకు ఒక టోల్ గేట్ కి 15 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయబడుతుంది. అయితే వీటిలో ఏది ముందుగా వస్తే అది.

ఈ విధానం 60 కి.మీ పరిధిలోని టోల్ ప్లాజాల గురించి దీర్ఘకాలిక ఆందోళనలను పరిష్కరిస్తుంది మరియు ఒకే, సరసమైన లావాదేవీ ద్వారా టోల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, రద్దీని తగ్గించడం మరియు టోల్ ప్లాజా ల వద్ద వివాదాలను తగ్గించడం ద్వారా, వార్షిక పాస్ లక్షలాది ప్రైవేట్ వాహన యజమానులకు వేగవంతమైన మరియు సున్నితమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది.