
పాత వాహనాలకు బ్రేక్ – ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
పాత వాహనాలకు బ్రేక్ – ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం :
జులై 1 2025 నుంచి కొత్త చట్టం ని అమలు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. వాయు కాలుష్యం పెరుగుతున్న కారణంగా పాత వాహనాలను తొలగించి వాయు కాలుష్యాన్ని మెరుగు పరచాలంటూ ప్రజలను ఆదేశించింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడం లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ తో కలిసి జులై 1 నుంచి పాత వాహనాల ను ఉపయోగించకూడదు అంటూ కొత్త రూల్ ని పాస్ చేసింది. పాత వాహనాలను ఉపయోగించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ ఆదేశాలు జారీ చేసారు.
2025 జులై 1 నుంచి 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలకు మరియు 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలకు ఇంధనం నింపడాన్ని నిషేధించారు. అంతేకాకుండా వాహనాల్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పారు. రేపటినుంచి ఈ ప్రక్రియ ను అమలు చేస్తారని వెల్లడించారు.
ఢిల్లీ లోని పెట్రోల్ పంపుల్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు పాత వాహనాలను గుర్తించడం లో ప్రధాన పాత్ర ను పోషిస్తాయి. వాహనం యొక్క వయస్సు పరిమితి దాటి ఉంటె ఇంధనం నింపడం నిషేధిస్తారు. నిబంధనలను ఉల్లఘిస్తే వాహనాలను స్వాధీనం చేసుకుని స్క్రాపింగ్ కేంద్రాలకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకుంటారు.
వాయు కాలుష్యంపై మా పోరాటంలో ఇది ఒక కీలకమైన అడుగు అని ఢిల్లీ రవాణా శాఖ సీనియర్ అధికారి తెలిపారు. పాత వాహనాలు నగరంలో వాయు నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం. ఈ వాహనాలను నడపకుండా నిబంధనలు ఉన్నప్పటికీ, ఇప్పుడు వాటి అమలును కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది.
గతం లో కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ కార్ల ను కూడా నిషేధించాలని చర్చలు జరిగినప్పటికీ అవి సఫలం అవ్వలేదు కానీ ఇప్పడు పాత పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల నిషేధింపు ఇప్పటి వాహనాలకు వెంటనే వర్తిస్తాయి అంటూ స్పష్టం చేసారు. ఇది ఢిల్లీ లో వాహనాల పైనే కాకుండా ఇతర రాష్ట్రా లలో నమోదు చేయబడి ఢిల్లీలో వయస్సు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలకు కూడా వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియ కేవలం ఢిల్లీకే పరిమితమ్ కాకుండా ఇతర రాష్ట్రాలలోను అమలు చేస్తామని కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఈ నియంత్రణను నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంతటా దశలవారీగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది.
నవంబర్ 1, 2025 నుండి, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ , మరియు సోనిపత్ వంటి ప్రధాన నేషనల్ కాపిటల్ రీజియన్ నగరాల్లోనూ ఈ పాత వాహనాల నియంత్రణ అమలు చేస్తామని. ఆ తర్వాత, ఏప్రిల్ 1, 2026 నాటికి, మిగిలిన నేషనల్ కాపిటల్ రీజియన్ జిల్లాలన్నింటికీ ఈ నిషేధం విస్తరించబడుతుంది అని ఢిల్లీ ప్రభుత్వం తెలియజేసింది.
పాత వాహనాలకు ఇంధనం నియంత్రించినపుడు వాహన యజమాని ఘర్షణ చేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేసారు పెట్రోల్ పుంపు యజమానులు. ఈ సమస్య ను పరిష్కరించడానికి ట్రాఫిక్ పోలీస్ లు పెట్రోల్ బంక్ దగ్గర మరియు పాత వాహనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో అదనపు సిబ్బంది ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కొత్త నిబంధన వల్ల వాయు కాలుష్యం తగ్గుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన ని దృష్టి లో పెట్టుకునే వాహనం దారులు తమ వాహన వయస్సును చెక్ చేసుకోవాల్సింది గా లేదంటే జరిమానా లేదా వాహనాలను స్క్రాప్ కు అందజేస్తాము అని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ ప్రక్రియ ను ఢిల్లీ మరియు పరిసర నేషనల్ కాపిటల్ రీజియన్ లో ప్రస్తుతం నడుస్తున్న చాల పాత వాహనాల పై ప్రభావం చూపుతుందని, తక్కువ కాలుష్యం వ్యాపించే కొత్త వాహనాలకు వేగంగా మారడానికి ప్రోత్సహిస్తుంది అని భావిస్తున్నారు .