Headlines
jagannath ratha yathra stampede

జగన్నాథుని రథ యాత్ర లో అపశ్రుతి – తొక్కిసలాట తో కలకలం

జగన్నాథుని రథ యాత్ర లో అపశ్రుతి.

ఒడిశాలోని పూరి పట్టణం లో ఘనంగా జరుగుతున్న పూరి జగన్నాథ్ రథ యాత్ర లో పాల్గొన్న భక్తులు తీవ్ర గాయాలకు గురయ్యారు. పూరి జగన్నాథ్ రథ యాత్ర లో తొక్కిసలాట జరిగింది. స్వామి వారి రథాలు నిన్న సాయంత్రం గుండిచా ఆలయం కి చేరుకోగా ఇవ్వాళా తెల్లవారుజామున 4.30 కి స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్య లో గుండిచా ఆలయం కి చేరుకోగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటన లో 3 చనిపోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండటం వలన ఊపిరి ఆడక భక్తులు అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయారు. వైద్య సిబ్బంది అప్రమత్తం అయ్యి సహాయక చర్యలు చేపట్టారు.

పూరి జగన్నాథ్ రథ యాత్ర లో మొదటి రోజు భక్తులు అస్వస్ధ కి గురయ్యారు. అధిక రద్దీ మరియు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల రథ యాత్ర లో పాల్గొన్న వందలాది భక్తులు అస్వస్ధకి గురయ్యారు. దాదాపు గా 600 మంది అస్వస్ధకి గురయ్యారు వైద్య సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్ధ కి గురైన వారిలో చాల మంది ప్రాధమిక చికిత్స కి కోలుకోగా 70 మంది భక్తులు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అందులో 9 మంది పరిస్థితి విషమం గా ఉంది అని వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నాం అని అధికారులు తెలియజేసారు. హాస్పిటల్ లో ఉన్న భక్తుల ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారని చెప్పారు.