
చీనాబ్ రైలు వంతెన మరియు అంజి వంతెన ప్రారంభం.
చీనాబ్ రైలు వంతెన మరియు అంజి వంతెన ప్రారంభం :
ఈ రోజు జూన్ 6 2025 ప్రపంచం లో అతి పెద్దదైన రైల్వే వంతనగా గుర్తింపు పొందిన చీనాబ్ రైల్వే వంతెన భారత్ లోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతం లో నిర్మించారు. భారత్ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే అధికారికంగా ప్రారంభించబడినది.ఈ వంతెన ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పచ్చు. ఇది ప్రపంచం లోనే అతి పొడవైన ఐఫిల్ టవర్ కన్నా ఎత్తులో నిర్మించబడినది.
ప్రపంచం లోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జిగా చీనాబ్ బ్రిడ్జి గుర్తింపు పొందింది. ఈ వంతెన జమ్మూ మరియు శ్రీనగర్ ని కలుపుతూ సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎగువన 1.3 కిలోమీటర్ల పొడవు 28660 మెట్రిక్ టన్నుల ఇనుము వాడి నిర్మించడం జరిగినది. ఈ బ్రిడ్జి గంటకి 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులని మరియు -10 కంటే తక్కువ నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను, 8.0 రెక్టర్స్ స్కేల్ తీవ్ర భూకంపం ని తట్టుకునేలా నిర్మించారు. ఈ బ్రిడ్జిని 40 TNT బ్లాస్ట్ ని సైతం తట్టుకునే ల ప్రత్యేకమైన ఉక్కు ని వాడి నిర్మించారు. ఈ బ్రిడ్జి 120 ఏళ్ళు జీవత కాలం ఉండేలా దీని పై నడిచే రైల్ గంటకి 100 కిలోమీటర్ల వేగం తో వెళ్లేలా నిర్మాణం చేసారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు జమ్మూ కాశ్మీర్‌లో చీనాబ్ రైలు వంతెన మరియు అంజి వంతెన ప్రారంభించారు. భారతదేశం నిర్మాణ రంగంలో ఎంత ముందుకెళ్లిందో, ప్రపంచానికి చూపించేలా రెండు అద్భుత వంతెనలను చీనాబ్ రైలు వంతెన మరియు అంజి వంతెన ప్రారంభించారు.ఇవి కేవలం వంతెనలు కాదు. ఇవి మన దేశ అభివృద్ధికి, కలలకు, మన సామర్థ్యానికి వంతెనలు.
చిన్న చిన్న గ్రామాలూ, పర్వతాల మధ్య నుంచి వెళ్లే ఈ వంతెనలు కేవలం కాంక్రీటు, ఉక్కుతో చేసిన నిర్మాణాలు కావు. ఇవి భారతదేశ ప్రజల కలల్ని, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభివృద్ధి ఆశల్ని నెరవేర్చే ప్రతీకలు. అలానే, వందే భారత్ రైళ్లు కూడా ఈ రోజే ప్రారంభించారు. కత్రా నుంచి శ్రీనగర్ వరకూ వేగంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ఈ రైళ్లు ఎంతో ఉపయోగపడతాయి. మంచు పడే కాశ్మీర్ వాతావరణంలోనూ ఇవి చక్కగా పనిచేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
అలాగే, ఈ ప్రాజెక్టుల వల్ల కేవలం ప్రయాణ సౌలభ్యం మాత్రమే కాదు వాణిజ్యం పెరుగుతుంది, పర్యాటకం బాగా అభివృద్ధి అవుతుంది, కాశ్మీర్ ప్రజలకు మరింత అవకాశాలు వస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఈ వంతెనలను నిర్మించిన ఇంజనీర్లూ, కార్మికులూ చేసిన తపనకు మోదీ గారు కృతజ్ఞతలు తెలిపారు. ఎత్తయిన పర్వతాల మధ్య నిర్మాణం అంటే మాటలు కాదు ఇది నిజంగా కృషి, నిబద్ధత.
తాజాగా జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని గట్టిగా ఖండించిన ఆయన, “భారతదేశాన్ని ఆగకుండా అభివృద్ధి పథంలో నడిపించడమే మన అసలైన జవాబు,” అన్నారు. కాశ్మీర్‌లో శాంతి, పర్యాటకం, అభివృద్ధి కలగాలంటే ఉగ్రవాదానికి తావుండకూడదని స్పష్టంగా చెప్పారు.