
ఘనంగా పూరి జగన్నాథ్ రథ యాత్ర- 2025.
ఘనంగా పూరి జగన్నాథ్ రథ యాత్ర- 2025.
ఈ సంవత్సరం పూరి జగన్నాథ్ రథ యాత్ర మొదలయ్యింది. ఈ యాత్రను హిందువులు పెద్ద పండగ లాగా జరుపుకుంటారు. ఒడిశాలోని పూరి పట్టణం లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ రథ యాత్ర ఉత్సవం లో శ్రీ జగన్నాథ్ స్వామి, వారి అన్న బలభద్రుడు మరియు చెల్లెలు సుభద్ర దేవి వేరు వేరు రథాలలో శ్రీ గుండిచా మందిరానికి ప్రయాణం మొదలు పెడతారు.
రథ యాత్ర కు 60 రోజులు ముందు పనులను వైశాఖ బహుళ విదియనాడు మొదలుపెడతారు. రథాల నిర్మాణానికి 13 వేల ఘనపుటడుగుల కలప ను ఉపయోగిస్తారు. ప్రధాన పూజారి నేతృత్వంలో అక్షయ తృతీయ నాడు రథాల నిర్మాణాన్ని ప్రారంభిస్తారు.
శ్రీ జగన్నాథ స్వామి వారిది నందిఘోష రథము 832 కలప ముక్కలతోని సుమారు 46 అడుగుల ఎత్తు మరియు 16 చక్రాలతో జగన్నాథుని రథం సిద్ధం చేస్తారు. బలరాముడి రథం తాళధ్వజం కోసం 763 కలప ముక్కలతోని 44 అడుగులు 14 చక్రాలు తో ఉంటుంది. సుభద్ర దేవి రథం పద్మధ్వజ లేదా దర్పదళన రథం 593 కలప ముక్కలతోని 43 అడుగులు 12 చక్రాలతో రథాన్ని తాయారు చేస్తారు.
ఆషాఢ శుక్ల విదియనాడు పాండాలు( పూజారులు ) మేళతాళాలతో తెల్లవారుజాము పూజలు నిర్వహించి స్వామి వారి నామాన్ని నినాదం చేస్తూ విగ్రహాలని కదిలిస్తారు. అక్కడి ప్రాంతాలలో ఊరేగిస్తూ కుల మాత భేదాలకు లేకుండా జగన్నాథుని రథ యాత్ర కి కోట్లాది భక్తులు పాల్గొంటారు. ఈ రథ యాత్ర ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.
కార్యక్రమం లో భాగంగా జగన్నాథుని రథం ని పూరీ మహారాజు జగన్నాథుని ముందు సేవకుడిగా మారి ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తారు. రథానికి ఉన్న తాళ్లను లాగుతూ మూడు కిలోమీటర్ల దూరం లో ఉన్న గుండిచా ఆలయాన్ని చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. చేరుకున్న రోజు రాత్రి ఆలయం బయట రథల్లోనే విశ్రాంతినిస్తారు. తరువాతి రోజు తెల్లవారుజామున పూజలు నిర్వహించి ఘనంగా మేళతాళాలతోని స్వాగతిస్తారు. గుండిచా ఆలయం లో వారం రోజులు పాటు ఆతిధ్యం స్వీకరించి దశమి నాడు తిరిగి ప్రయాణం మొదలు పెట్టగా, ఏకాదశి నాడు స్వామివార్లని బంగారు ఆభరణాలతో అలంకరించి పూజలకు అనుమతిస్తారు. ద్వాదశి నాడు మల్లి విగ్రహాలను రత్న సింహాసనం పై ప్రతిష్టించడం తో రథ యాత్ర పూర్తవుతుంది. జగన్నాథుడు లేక చిన్నబోయిన పూరీ, స్వామి వారి రాకతో కొత్త కళను సంతరించుకుంటుంది.