
ఆపరేషన్ సిందూర్ పై భారత్ ప్రధాని వివరణ .
ఆపరేషన్ సిందూర్:
ఆపరేషన్ సిందూర్ తర్వాత జాతిని ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు సోమవారం మాట్లాడుతూ, ఈ సందర్భంగా మన దేశ సైన్యానికి, గూఢచార సంస్థలకు, శాస్త్రవేత్తలకు, ప్రతి భారతీయుడి తరపున శిరసు వంచి నమస్కరిస్తున్నా అన్నారు. దేశంలోని మహిళల నుదిటి నుండి ‘సిందూర్’ (సిందూర్) లాక్కుంటే ఏమి జరుగుతుందో భారతదేశం ప్రపంచానికి తెలియజేసింది అన్నారు.
పహల్గామ్ దాడి:
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఉగ్రవాదం యొక్క అనాగరిక ముఖంగా అభివర్ణించిన, సెలవులు జరుపుకుంటున్న నిరపరాధులను, వారి కుటుంబాల ముందు, పిల్లల ముందు కిరాతకంగా హతమార్చడం ఉగ్రవాదం యొక్క దిగ్భ్రాంతికర రూపాన్ని చూపింది. “అది తనకు వ్యక్తిగతంగా చాలా బాధని కలిగించింది అన్నారు”.
ఈ దాడి తర్వాత దేశం మొత్తం, ప్రతి పౌరుడు, సమాజం, రాజకీయ పక్షలు ఏకతాటిపై నిలిచి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది అన్నారు.
న్యాయం కోసం యుద్ధం :
మే 7న పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు మరియు డ్రోన్‌లతో కూడిన దాడులతో ప్రారంభమైన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రత్యక్ష ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్‌ను మోదాహాలు పెట్టిన భరత్ . ఈ ఆపరేషన్‌లో భాగంగా, 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాము అన్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం పేరు కాదు. ఇది దేశంలోని లక్షలాది మంది ప్రజల భావాలను ప్రతిబింబిస్తుంది . ఇది న్యాయం కోసం చేసిన అవిచ్ఛిన్న ప్రతిజ్ఞ.
ఫౌలాదీ నిర్ణయాలు :
దేశం ఏకమై, ‘నేషన్ ఫస్ట్’ భావనతో నిండినప్పుడు, ఫౌలాదీ నిర్ణయాలు తీసుకోబడతాయి. భారత మిస్సైళ్లు, డ్రోన్‌లు పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడి చేసినప్పుడు, ఉగ్రవాద సంస్థల భవనాలతో పాటు వారి ధైర్యం కూడా వణికిపోయింది. బహవల్పూర్, మురీద్ వంటి ఉగ్ర శిబిరాలు గ్లోబల్ టెర్రరిజం యూనివర్సిటీలుగా ఉండేవి. భారత్‌లో దశాబ్దాలుగా జరిగిన భారీ ఉగ్ర దాడుల వెనుక ఈ శిబిరాల పాత్ర ఉంది. మన సోదరీమణుల సిందూరాన్ని ఉగ్రవాదులు నాశనం చేశారు, కానీ భారత్ ఈ ఉగ్రవాద కేంద్రాలను నాశనం చేసింది.పాకిస్తాన్ ఆర్మీ భారత్ కి వ్యతిరేకంగా ఉగ్రవాదులు పెంచిపోషిస్తుంది అన్నారు.ఉగ్రవాదులు మరణిస్తే పాకిస్తాన్ ఆర్మీ మొత్తం కంట తడి పెట్టింది అన్నారు.
భయాందోళన లో పాకిస్థాన్ :
భారత్ త్రివిధ దళాలు ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన తరువాత ఉగ్రవాదాన్ని అంతు చేయాల్సిన పాకిస్థాన్ మన పై ఎదురు దాడి చేసింది ఐతే పాకిస్థాన్ డ్రోన్స్ భారత్ లో కి రాలేకపోయాయి .కానీ మనం పాకిస్థాన్ గుండెల్లో బాంబు పేల్చాము పాక్ లో ని ఎయిర్ బేస్ లకు తీవ్రంగా నష్టం చేసాం పాకిస్థాన్ వాయు రక్షణ వ్యవస్థను నిర్మూలంగా నాశనం చేసాము ఈ దెబ్బ తో బెంబేలెత్తి పోయిన పాకిస్తాన్ శాంతి కోసం అంతర్జాతీయంగా వేడుకోవడం మొదలుపెట్టింది.
కొత్త లక్ష్యాలు :
మే 10న పాకిస్తాన్ సైన్యం మన డీజీఎంఓను సంప్రదించి, ఇకపై ఉగ్రవాద చర్యలు, సైనిక దుస్సాహసాలు ఉండవని హామీ ఇచ్చింది. అందుకే, మేము మా జవాబు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశాము. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదం అణ్వాయుధ పేరుతో బెదిరింపులను కి దిగితే . భారతదేశం ఆటువంటి “అణు బ్లాక్‌మెయిల్”ను సహించదని, పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్‌ను కేవలం నిలిపివేసామ్ పాకిస్తాన్ ప్రవర్తనను ఈ కోణంలో పరిశీలిస్తాము. భారత సైన్యం, వాయుసేన, నౌకాదళం, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అప్రమత్తంగా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ యొక్క కొత్త విధానం. ఇది ఉగ్రవాదంతో పోరాడటానికి కొత్త ప్రమాణాలను నిర్దేశించింది.
మూడు కీలక సూత్రాలు :
1. భారత్‌పై ఉగ్ర దాడి జరిగితే, ముఖం తడమకుండా జవాబు ఇస్తాము. మా నిబంధనలతో, మా విధానంలో చర్య తీసుకుంటాము.
2. అణ్వాయుధ బెదిరింపులను భారత్ సహించదు. అటువంటి బెదిరింపుల ఆడ ఉగ్ర శిబిరాలపై ఖచ్చితమైన దాడులు చేస్తాము.
3. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇచ్చే ప్రభుత్వాలను, ఉగ్రవాద నాయకులను వేరుగా చూడము.
మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల శక్తి :
ఈ ఆపరేషన్‌లో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు తమ సామర్థ్యాన్ని నిరూపించాయి. 21వ శతాబ్దపు యుద్ధ సాంకేతికతలో భారత రక్షణ సామగ్రి తన స్థానాన్ని సుస్థిరం చేసింది. రణరంగంలో పాకిస్తాన్‌ను పదే పదే ఓడించిన భారత్, ఈ సారి ఆపరేషన్ సిందూర్‌తో కొత్త ఒరవడిని సృష్టించింది.
ఐక్యతే మన బలం :
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన ఐక్యతే మన గొప్ప బలం. ఈ యుగం యుద్ధానిది కాదు, కానీ ఉగ్రవాదానిది కూడా కాదు. ఉగ్రవాదంపై సున్నా సహనం మానవాళికి మంచి భవిష్యత్తును అందిస్తుంది. పాకిస్తాన్ తన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయకపోతే, అది తనను తాను నాశనం చేసుకుంటుంది. భారత్ యొక్క విధానం స్పష్టం—ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి సాగవు. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి నడవవు. రక్తం, నీరు ఒకే మార్గంలో ప్రవహించవు.
శాంతి కోసం శక్తి :
ఈ రోజు బుద్ధ పూర్ణిమ. భగవాన్ బుద్ధుడు శాంతి మార్గాన్ని చూపించారు. కానీ శాంతి కూడా శక్తి ద్వారానే సాధ్యమవుతుంది. భారత స్వప్నం సాకారం కావాలంటే, భారతం శక్తివంతంగా ఉండాలి. గత కొన్ని రోజుల్లో భారత్ ఈ శక్తిని ప్రదర్శించింది. మరోసారి భారత సైన్యానికి, సశస్త్ర బలగాలకు సలాం చేస్తూ, ప్రతి భారతీయుడి ఐక్యతా సంకల్పాన్ని నమస్కరిస్తున్నాను.