ఓజి: పవన్ ఫ్యాన్స్‌కు యాక్షన్ పండగ.
పవన్ కళ్యాణ్ అభిమానులు గత కొన్ని నెలలుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజి’. ప్రొడక్షన్ దశ నుండే భారీ అంచనాలు ఏర్పడిన ఈ మూవీ, హైప్‌కు తగ్గట్టుగా కంటెంట్‌తో వచ్చిందా? అభిమానుల ఆశలు తీర్చిందా? అనేది చూద్దాం.
కథ 1940లలో జపాన్‌లో మొదలై 1980లలో ముంబైకి చేరుతుంది. జపాన్ నుండి ముంబై వచ్చే క్రమంలో సత్యదా (ప్రకాష్ రాజ్)కు ఓజస్ గంభీర (పవన్ కళ్యాణ్) సహాయం చేసి పరిచయమవుతాడు. సత్యదా బాంబేలో పోర్టు నడుపుతుంటాడు, ఓజస్ దానికి సంరక్షకుడు. పోర్టులో RD X కంటైనర్ మిస్ అవడంతో సత్యదా మాజీ పార్ట్నర్ కొడుకు ఓమి (ఇమ్రాన్ హాష్మి) రంగంలోకి దిగి సత్యదా కుమారుడిని చంపేస్తాడు. ఇప్పటికే సత్యదాకు దూరమై, భార్య కమని (ప్రియాంక మోహన్)తో అజ్ఞాత జీవితం గడుపుతున్న ఓజస్, సత్యదా కుటుంబానికి ఎందుకు దూరమయ్యాడు? సమస్యల్లో చిక్కుకున్న సత్యదాకు మళ్లీ వస్తాడా? గంభీర vs ఓమి ఫేసాఫ్ ఎలా ఉంటుంది? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవాలి.

దర్శకుడు సుజిత్, పవన్ ఫ్యాన్‌గా అభిమానుల ఆకలి అర్థం చేసుకుని ఈ సినిమా రాసుకున్నాడు. కథ సాధారణమే అయినా, స్క్రీన్‌ప్లేలో ఎలివేషన్స్ జోడించి మెరుగుపరిచాడు. మారుతున్న టైమ్ ఫ్రేమ్స్ కొంచెం కన్ఫ్యూజ్ చేసినా, ఓవరాల్ కంటెంట్ మెప్పిస్తుంది. తమన్ బీజీఎం, పాటలు సినిమాను నిలబెట్టాయి. ఫస్ట్ హాఫ్ స్టోరీ స్లోగా సాగినా, సెకండ్ హాఫ్ క్యూరియాసిటీ కలిగిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్. సెకండ్ హాఫ్ మొదటి 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ వైలెన్స్‌తో ఉంది. పోలీస్ స్టేషన్ సీన్ హైలైట్. కానీ తర్వాత రొటీన్ అయింది. ఎలివేషన్స్ కామన్‌గా అనిపించాయి. ఎమోషన్స్ అంతగా వర్కవుట్ కాలేదు. సాహోతో కనెక్షన్ ఒక హై మూమెంట్ కోసమే.
పవన్ కళ్యాణ్ ఓజి క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేశాడు. ఫస్ట్, సెకండ్ హాఫ్ వేరియేషన్ సూపర్. ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, ఇమ్రాన్ హాష్మి, ప్రియాంక మోహన్ మెప్పించారు. తమన్ మ్యూజిక్ హైలైట్. రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ, 1980ల బాంబే టింట్ అద్భుతం. ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్ ఆథెంటిక్. డివివి దానయ్య నిర్మాణ విలువలు అన్కాంప్రమైజ్డ్.
సుజిత్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు. కానీ కథా కథనాలపై మరిన్ని ఈవెంట్స్ ఉంటే మరింత బెటర్. ఓవరాల్, ‘ఓజి’ అభిమానులకు పండగ. యాక్షన్ లవర్స్‌ను అలరిస్తుంది. జనరల్ ఆడియన్స్ లిమిటెడ్ అంచనాలతో వెళ్తే ఎంజాయ్ చేయవచ్చు.