King Nagarjuna

నాగార్జున కొత్త సినిమాతో గట్టి కంబ్యాక్ ప్లాన్

తెలుగు సినిమా లోకంలో కింగ్ నాగార్జున గట్టి కంబ్యాక్ కోసం సన్నాహాలు చేస్తున్నాడు. 2022లో వచ్చిన బంగార్రాజు తర్వాత పెద్దగా హిట్ లేకపోవడంతో, ది ఘోస్ట్, నా సామిరంగ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో హీరోగా కాస్త విరామం తీసుకుని, సపోర్టింగ్ రోల్స్‌లో ధనుష్ కుబేర, రజనీకాంత్ కూలీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు.

ఇప్పుడు నాగార్జున తమిళ దర్శకుడు కార్తీక్‌తో కలిసి కొత్త చిత్రం చేయనున్నాడు. ‘కింగ్ 100’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవ సందర్భంగా నిర్మితం కానుంది. ఈ నెల 29న నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. నాగార్జున ఈసారి ఎలాంటి కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.