ఎన్టీఆర్ VS హృతిక్ – వార్ 2 ట్రైలెర్ తో సోషల్ మీడియా షేక్.
ఎన్టీఆర్ VS హృతిక్ – వార్ 2 ట్రైలెర్ తో సోషల్ మీడియా షేక్ :
టాలీవుడ్ మరియు బాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ లు నటించిన వార్ 2 చిత్రం ట్రైలర్ ఇటీవల రిలీజ్ చేసారు.
వార్ చిత్రాన్ని ఎంతగానో అభిమానించిన ప్రేక్షకులు ఇపుడు వార్ 2 చిత్రం కోసం కూడా అంతే ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎన్టీఆర్ మొదటిసారిగా బాలీవుడ్ లో కి అడుగు పెట్టనున్నారు. అభిమానులకి భారీ అంచనాలను పెంచిన ఈ చిత్రం ఆగష్టు 14 న విడుదల కానుంది. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ వర్కౌట్ అవుతుందా లేదా అని చూడాలి మరి !
ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు చూద్దాం :
ట్రైలర్ మొత్తం హృతిక్ మరియు ఎన్టీఆర్ కి జరిగే ఘర్షణ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళ ఇద్దరి మధ్య జరిగే ఘర్షణ లో హై యాక్షన్ సీన్స్ మరియు భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో నిండిపోయింది.
ట్రైలర్ ప్రారంభం లో హృతిక్ (కబీర్) చెప్పే డైలాగ్స్ ఎంతో ఎమోషనల్ గా తనని తాను దేశం కోసం వదులుకుని ఆయుధం గా మార్చుకున్నట్లు, ఒక షాడో గా మారినట్లు ప్రేమించిన అమ్మాయి ని సైతం వదులుకుంటూ ట్రైలర్ లో ఒక వాయిస్ ఓవర్ ఇస్తారు.
ఎన్టీఆర్ పాత్ర కి వస్తే తాను ఒక సైనికుడిగా యుద్ధం లో ఎంతో శక్తివంతంగా కనిపిస్తారు. ఎన్టీఆర్ చెప్పే పవర్ఫుల్ డైలాగు “చస్తాను లేదా చంపుతాను” తో తన పాత్ర యొక్క తీవ్రత ను తెలియజేస్తారు. ఇద్దరు సైనికులు అయినప్పటికీ ఇండియా ఫస్ట్ అని నమ్మినప్పటికీ, ఒకరికోరు యుద్ధం చేసుకోవడానికి సిద్ధమయ్యారు.
కథానాయిక గా కియారా అద్వానీ నటించగా ట్రైలర్ ప్రారంభం లో హృతిక్ తో ప్రేమ లో ఉన్నట్టు ఉన్నా తరువాత తనతోనే యుద్ధం చేయడానికి సిద్ధం అయ్యింది. ఆమె పాత్ర లో ఏదో మిస్టరీ ఉన్నట్టుగా ట్రైలర్ లో కనిపిస్తుంది.
ఈ ట్రైలర్ కి అభిమానుల నుండి భారీ స్పందన లభించింది సోషల్ మీడియా లో ఈ ట్రైలర్ ట్రేండింగ్ గా నిలిచింది. ప్రధానంగా ఎన్టీఆర్ చేస్తున్న డెబ్యూ మీద అభిమానులు భారీగా అంచనాలని పెట్టుకున్నారు.
ఈ ట్రైలర్ కి వివిధ భాషల్లో రిలీజ్ చేయగా భారీగా వ్యూస్ వచ్చాయి. 24 గంటల్లోనే అత్యధిక స్థాయిలో వీక్షణలు పెరిగాయి. మొత్తం 55 మిలియన్ల వ్యూస్ లభించాయి. ఈ చిత్రం ఆగష్టు 14 న ప్రేక్షకుల ముందుకి రానుంది.