Raana ED case

సినీ నటుడు రానా కు బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ సమన్లు.

బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రముఖ సినీ నటుడు రానా మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాడార్‌లో చిక్కుకున్నారు. ఈ కేసు విషయంలో ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు సినీ నటుడు రానా కు తాజాగా సమన్లు జారీ చేశారు. అసలు ఈ రోజు (జులై 23, 2025) ఉదయం 11 గంటలకు రానా ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. కానీ, ముందుగా నిర్ణయించిన షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా ఆయన ఈ విచారణకు రాలేకపోయారు. దీంతో, కొంత సమయం గడువు పొడిగించాలని రానా ఈడీని కోరారు.

నిన్న సాయంత్రం రానా ఈడీ అధికారులకు ఇమెయిల్ ద్వారా సమాచారం పంపారు. ప్రస్తుతం తాను వేరే రాష్ట్రంలో షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, ఈ రోజు విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని, కొత్త తేదీని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన ఈడీ అధికారులు, ఆగస్టు 11వ తేదీన రానా విచారణకు రావాలని సూచిస్తూ మరోసారి సమన్లు పంపించారు.

ఈ కేసులో రానా ఒక్కరే కాదు, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్ వంటి ఇతర సినీ ప్రముఖులకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం  ఈడీ కార్యాలయానికి రావాల్సి ఉన్నప్పటికీ, షూటింగ్ కమిట్‌మెంట్స్ కారణంగా ఆయన హాజరు కాలేదు. దీంతో ఈడీ ఆగస్టు 11ని కొత్త తేదీగా నిర్ణయించింది.

ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టు 11పైనే ఉంది. రాణ ఆ రోజు విచారణకు హాజరవుతారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈడీ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి.