
విశ్వంభర
మల్లిడి వశిష్ట గారి దర్శకత్వం లో చిరంజీవి గారు నటిస్తున్న తెలుగు సోషియో – ఫాంటసీ చలన చిత్రం విశ్వంభర.
ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ తో కలిసి ప్రమోద్ ఉప్పలపాటి, వి.వంశీ కృష్ణా రెడ్డి మరియు విక్రమ్ రెడ్డి గారు నిర్మించారు.
ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం. కీరవాణి గారు అందిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి గారు చిరంజీవి గారితో చేస్తున్న 4 వ చిత్రం ఇది.
విశ్వంభర చిత్ర ముహూర్తం పూజని చిత్ర యూనిట్ 23 అక్టోబర్ 2023న భాగ్యనగరంలో ప్రారంభించారు.
ఈ చిత్ర కథానాయకిగా త్రిష కృష్ణన్ గారు నటిస్తున్నారు. స్టాలిన్ చిత్రం తరువాత మెగా స్టార్ చిరంజీవి గారు మరియు త్రిష గారు నటిస్తున్న రెండవ చిత్రం ఇది .
- దర్శకత్వం – మల్లిడి వసిష్ఠ
- రచన – మల్లిడి వసిష్ఠ
- డైలాగులు – సాయి మాధవ్ బుర్రా
- నిర్మాత – ప్రమోద్ ఉప్పలపాటి
వి. వంశీ కృష్ణా రెడ్డి
విక్రమ్ రెడ్డి - తారాగణం – చిరంజీవి
- ఛాయాగ్రహణం – చోట కే నాయుడు
- కూర్పు- కోటగిరి వెంకటేశ్వరరావు
సంతోష్ కామిరెడ్డి - సంగీతం – ఎం ఎం కీరవాణి
- నిర్మాణ సంస్థ – యువి క్రియేషన్స్
- భాష- తెలుగు
ఈ చిత్రం ఆగష్టు 22 2025 న చిరంజీవి గారి పుట్టిన రోజున రిలీజ్ చేస్తారని అంచనా .విశ్వంభర చిత్రం లో నటిస్తున్న ఇంకొందరి నటీ నటుల పేర్లు.
• చిరంజీవి
• త్రిష కృష్ణన్
• కునాల్ కపూర్
•మీనాక్షి చౌదరి
•ఆశిక రంగనాథ్
•సురభి పురాణిక్
•ఇషా చావ్లా
•శుభలేఖ సుధాకర్
•చైతన్య కృష్ణ
•రావు రమేష్
•రాజీవ్ కనకాల
•భగవతి పెరుమాళ్