Headlines

రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న రెండు ప్రేమ కథా చిత్రాలు.

రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న రెండు ప్రేమ కథా చిత్రాలు :

తెలుగు సినిమా ప్రేమికులకు శుభవార్త ! తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి నిలిచిపోయిన ప్రేమ కథా చిత్రాలు రెండు రీ-రిలీజ్ కి సిద్ధం అయ్యాయి. మనం ఎంతగానో అభిమానించిన సినిమాలు “అందాల రాక్షసి” మరియు “తొలి ప్రేమ” ఈ చిత్రాలు మళ్ళీ సినిమా థియేటర్ లో రికార్డు లు సృష్టించబోతున్నాయి. ఈ చిత్రాలు ఇప్పటికి ఎప్పటికి యువతలో విశిష్టమైన స్థానాన్ని గెలుచుకుంది. ఇప్పుడు ఈ రీ-రిలీజ్ కి ఇప్పటి యువత ఎలా స్పందిస్తారో చూడాలి !

అందాల రాక్షసి :

లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం. ఈ చిత్రం ముగ్గురుకి మొదటి చిత్రం అవ్వడం విశేషం. ఇది ఒక త్రికోణ ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఇది హను గారిది కూడా మొదటి చిత్రం అవ్వడం ఇంకా ప్రత్యేకం, ఆయన దర్శకత్వం చేసిన చిత్రాలు క్లాసిక్ గా ఉండటం చూస్తూనే ఉన్నాం, ఆయన కథన శైలి వల్ల ఆ చిత్రాలు క్లాసిక్ హిట్స్ అవుతాయి వారు దర్శకత్వం వహించిన చిత్రాలు “సీత రామం”, “కృష్ణ గాడి వీర ప్రేమ గాధ”, “LIE”, మరియు “పడి పడి లేచే మనసు”. ఈ చిత్రానికి రాధన్ గారు సంగీత దర్శకత్వం చేసారు, ఈ చిత్రం వారికీ తెలుగు లో మొదటి చిత్రం. ఎవడే సుబ్రహ్మణ్యం, అర్జున్ రెడ్డి, హుషారు, పాగల్, జాతి రత్నాలు వంటి హిట్ సినిమాలకి సంగీతం అందించారు. ఈ సినిమా జూన్ 13 2025 న ప్రేక్షకుల ముందుకి రానుంది.

RE-RELEASE OF ANDALA RAKSHASI

తొలి ప్రేమ :

తొలి ప్రేమ 1998 లో కరుణాకరన్ గారి దర్శకత్వం లో వచ్చిన ప్రేమ కథా చిత్రం. పవన్ కళ్యాణ్ మరియు కీర్తి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిపోయిన చిత్రం తొలి ప్రేమ. ఈ చిత్రం రీ-రిలీజ్ అవ్వడం వారి అభిమానుల్లో ఉత్సాహాన్నిపెంచింది. హరి హర వీర మల్లు ఎప్పటికప్పుడు వాయిదా అవుతున్నప్పటికీ ఈ రీ-రిలీజ్ వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రేమ, త్యాగం , భావోద్వేగాలతో కలయిక లో వచ్చినా ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. వచ్చిన అప్డేట్ ప్రకారం జూన్ 14 2025 న రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

RE-RELEASE OF THOLI PREMA

ఈ రెండు చిత్రాలు రీ-రిలీజ్ అవుతాయనే వార్త అభిమానులకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది.సోషల్ మీడియా లో కౌంట్ డౌన్ మొదలయింది అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పటికే అభిమానులు టికెట్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. థియేటర్ ల వద్ద ప్రత్యేకంగా బ్యానెర్లు ఏర్పాటు చేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు.