Headlines
RC LATEST IMAGE

రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ.

మెగా స్టార్ చిరంజీవి గారి కుమారుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. ఆయన నటించిన RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో, లండన్‌లోని ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇది చాల విశేషకరమైన మైనపు విగ్రహం ఎందుకంటే విగ్రహాన్ని సోఫా కూర్చున్నట్టుగా పెట్టడం విశేషం , ఇప్పటికి ఆ మ్యూజియం చాల మంది సెలెబ్రెటీ ల విగ్రహాలు ఉన్నప్పటికీ ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏ విగ్రహం కుడా వారి పెంపుడు జంతువులతో లేదు రామ్ చరణ్ గారి విగ్రహం మాత్రం తన పెంపుడు శునకం ఐనా రైమ్ తో ఆవిష్కరించారు .

సాధారణంగా సినీ హీరోల కుటుంబ సభ్యులు, పిల్లలు లేదా భార్యకు అభిమానులు ఉండటం సర్వసాధారణం. కానీ, రామ్ చరణ్ గారి పెంపుడు శునకం రైమ్కు అభిమానులు ఉండటం, సోషల్ మీడియాలో దాని వీడియోలు వైరల్ కావడం నిజంగా విశేషం.

అంతేకాదు, ఒక పెంపుడు జంతువుతో కలిసి విగ్రహం ఆవిష్కరణ జరగడం అనేది అత్యంత ప్రత్యేకమైన, చిరస్థాయిగా నిలిచిపోయే సంఘటన. ఇది అభిమానుల హృదయాల్లో, సినీ చరిత్రలో ఒక అద్భుత క్షణంగా మిగిలిపోతుంది.

ఎలిజబెత్ 2 రాణి తరువాత పెంపుడు జంతువుతో ఉన్న రెండవ మైనపు విగ్రహం ఇది . దీనితో రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ కాదు అని ట్రోల్ చేసిన వారందరికీ సమాధానం చెప్పేలా ఈ మైనపు విగ్రహం ఉంది అనడం లో సందేహం లేదు.

ఆవిష్కరణ కార్యక్రమం వివరాలు:

  •  తేదీ: మే 9, 2025
  •   వేదిక: మేడం టుస్సాడ్స్ మ్యూజియం, లండన్
  • హాజరైనవారు: రామ్ చరణ్, చిరంజీవి, మరియు వారి కుటుంబ సభ్యులు
  •   ప్రత్యేక ఆకర్షణ: రామ్ చరణ్ తన పెంపుడు శునకం రైమ్తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కార్యక్రమంలో జరిగినవి:

  •   రామ్ చరణ్ తన మైనపు విగ్రహం పక్కన ఫోటోలు దిగారు.
  •   అభిమానులు ఈ కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు రైమ్‌కు ఘన స్వాగతం పలికారు.
  •   ఈ ఈవెంట్ అభిమానులకు మరపురాని క్షణంగా నిలిచింది.

ఈ ఆవిష్కరణ రామ్ చరణ్ గారి అంతర్జాతీయ ఖ్యాతిని మరోసారి హైలైట్ చేసింది. మేడం టుస్సాడ్స్‌లో విగ్రహం ఏర్పాటు కావడం భారతీయ సినిమా పరిశ్రమకు, ముఖ్యంగా తెలుగు సినిమా రంగానికి గర్వకారణం .