రామ్ చరణ్ ‘పెద్ది’ సమ్మర్ రిలీజ్‌కు అడ్డంకులు
సమ్మర్ సీజన్‌లో మెగా స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా థియేటర్లను కలకలం రేపుతుందనే అంచనాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. మార్చి 27న రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించిన ‘పెద్ది’ ఇప్పుడు పోస్ట్‌పోన్ అవుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇటీవల నాని ‘పారడైస్’ మార్చి 26న, రామ్ చరణ్ ‘పెద్ది’ 27న రిలీజ్ అవుతాయని ప్రకటించారు. ఒకే రోజు గ్యాప్‌లో పోటీ పడతారా? అనే చర్చల మధ్య ఇద్దరూ అనుకున్న తేదీలకే వస్తామని గట్టిగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు రెండు చిత్రాలూ సమయానికి రావడం లేదనే సంకేతాలు వస్తున్నాయి.

‘పెద్ది’ షూటింగ్ ఇంకా దాదాపు 40 రోజులు మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, డబ్బింగ్ కూడా పూర్తికావాల్సి ఉంది. ఇటీవల డబ్బింగ్ మొదలుపెట్టి టీజర్ లాంచ్ చేశారు కానీ, సమయం సరిపోకపోవడంతో మార్చి 27 తేదీని కాపాడుకోవడం కష్టమని సమాచారం. నిర్మాతలు అధికారికంగా పోస్ట్‌పోన్ ప్రకటన చేయకపోయినా, వాయిదా గ్యారెంటీ అనే వాతావరణం నెలకొంది.
ఇక సమ్మర్ సీజన్‌లో ‘పెద్ది’ స్థానంలో ఉస్తాద్ భగత్ సింగ్ రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెప్పినా ఖచ్చితమైన తేదీ ఇంకా ప్రకటించలేదు. ‘పెద్ది’ మార్చి తర్వాత వస్తే, ఉస్తాద్ భగత్ సింగ్ సమ్మర్ స్లాట్‌ను భర్తీ చేసే అవకాశం ఉంది.
విశ్వంబర జూన్-జూలైలో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ‘పెద్ది’ రిలీజ్ తేదీపై ఇంకా క్లారిటీ లేదు. షూటింగ్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉండడంతో సమయం సరిపోకపోతే సమ్మర్‌లో రామ్ చరణ్ సినిమా లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తోంది. గత రెండేళ్ల సమ్మర్‌ల మాదిరిగానే ఈ సీజన్ కూడా సాదాసీదాగా సాగిపోయే అవకాశం ఉంది.