Headlines
PRABHAS RAAJA SAAB

రాజా సాబ్ టీజర్ విడుదల-ప్రభాస్ అభిమానులకి పండగ.

రాజా సాబ్ టీజర్ విడుదల – ప్రభాస్ అభిమానులకి పండగ :

ప్రభాస్ ఫాన్స్ కి కన్నుల పండగ గా రాజా సాబ్ టీజర్. అభిమానులు ఎంతనగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది ప్రభాస్ కథానాయకుడు గా నటిస్తున్న రాజా సాబ్ చిత్రం యొక్క టీజర్ నిన్న ఉదయం విడుదల చేసారు. విడుదల చేసిన కొన్ని నిమిషాలలోనే అత్యంత ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రానికి కామెడీ కి కేర్ అఫ్ అడ్రస్ గా ఉండే మారుతీ గారు దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ చూసాక అభిమానులకి ఈ చిత్రం మీద భారీ గా అంచనాలు పెరిగిపోయాయి.

చిత్రం వివరాలకొస్తే హారర్ కామెడీ చిత్రం గా తెరకెక్కుతుంది, ఎన్నో ఏళ్ళ క్రితం చూసిన వింటేజ్ ప్రభాస్ ని చూడచ్చు. ఈ చిత్రం లో స్టైలిష్ డ్రెస్, చాదస్తపు ఆచరణలు ఇంకా రాయలసీమ యాస తో మాట్లాడతారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ చాల కొత్తగా అనిపించింది. టీజర్ లో హారర్ ఎలెమెంట్స్ చాల ఎక్కువగా కనిపించాయి, కొన్ని షాట్స్ లో దయ్యం సీన్స్ లో ప్రభాస్ గారి రియాక్షన్స్ వేరే స్థాయి లో ఉన్నాయి. సంజయ్ దత్ పవర్ఫుల్ నెగటివ్ పాత్ర లో కనిపిస్తున్నారు. అయన లుక్, డైలాగ్ డెలివరీ టీజర్ లో చిన్నగా చూపించిన కథలో ప్రభాస్ కి ధీటైన విలన్ గా చూపించబోతున్నారు. సంగీతం ఎస్ఎ.స్.థమన్ గారు అందిస్తున్నారు. ఈ చిత్రం లో ముగ్గురు కథానాయికలతో మరియు డ్యూయల్ రోల్ లో ప్రభాస్ ప్రేక్షకులని అలరించనున్నారు.
రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5 న  2025 ప్రేక్షకుల ముందుకి రానుంది.