రష్మిక ‘గర్ల్ ఫ్రెండ్’ షాక్: 1.3 కోట్లే!
అయితే రష్మిక తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నవంబర్ 7న విడుదలైన ఈ సినిమాపై యువతలో ముందు నుంచే ఆసక్తి ఉంది. విడుదలైన తర్వాత సానుకూల స్పందనలు వచ్చాయి. రివ్యూలు కూడా చిత్రం అద్భుతమని, ముఖ్యంగా రష్మిక నటన అద్భుతంగా ఉందని ప్రశంసించాయి.
కానీ మొదటి రోజు వసూళ్లు మాత్రం నిరాశ పరిచాయి. ట్రేడ్ నిపుణుల ప్రకారం, భారత్‌లో అన్ని భాషలు కలిపి కేవలం రూ.1.30 కోట్ల నెట్ మాత్రమే సాధించింది. గ్రాస్‌లో దాదాపు రెట్టింపు అయినా, పాన్ ఇండియా స్థాయి నటి రష్మికకు ఇది చాలా తక్కువగా అనిపించింది. ఆమె అభిమానులు, వ్యాపార వర్గాలు ఈ ఫలితాలకు ఆశ్చర్యపోయాయి. ఓవర్సీస్లో అమెరికా ప్రీమియర్ల ద్వారా కేవలం 50 వేల డాలర్లు మాత్రమే వచ్చాయి.
అయినప్పటికీ వీకెండ్ బుకింగ్స్‌లో చిత్రం బాగా ఊపందుకుంది. మంచి మౌత్ టాక్, రష్మిక అభినయం ఆకట్టుకుంటే ముందు రోజుల్లో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఈ చిన్న బడ్జెట్ చిత్రం లాంగ్ రన్లో లాభాల బాట పట్టవచ్చని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.





