Headlines
NEW MOVIE

నందమూరి కుటుంబం నుంచి మరో NTR ఎంట్రీ

నందమూరి తారక రామ రావు గారి కుటుంబం నుంచి మరో హీరో ని పరిచయం చేస్తున్నారు . నందమూరి హరి కృష్ణ గారి పెద్ద తనయుడు ఐనా జానకి రామ్ గారి కుమారుడు నందమూరి తారక రామారావు తెరంగేట్రం చేయనున్నారు .
మే 12 వ తారీఖున ఈ చిత్రం పూజ కార్యక్రమం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నిర్వహించారు.

సీనియర్ ఎన్టీఆర్ గారి కుమార్తె, చంద్ర బాబు నాయుడు గారి ధర్మ పత్ని ఐనా నారా భువనేశ్వరి గారు చిత్రానికి క్లాప్ కొట్టి నటి నటులకు అల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమం లో నందమూరి కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఆడబిడ్డలు, మనవాళ్ళు, మనవరాళ్లు ఇలా కుటుంబ సభ్యులు అందరు హాజరు అయ్యారు .

నందమూరి వంశ 4 వ తరం వారసుడు NTR మాట్లాడుతూ తాను సినిమా ఇండస్ట్రీ లో కి రావడం చాలా సంతోషంగా ఉందని, తాను వేసే మొదటి అడుగుకి తనని ప్రోత్సహిస్తున్న తాతలు, అమ్మమ్మలు, నానమ్మ లు, బాబాయ్ లు ఇలా కుటుంబ సభ్యులు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.తనని ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

NTR LATEST PIC
దివి నుంచి వారి ముత్తాత ఎన్టీఆర్ గారు, తాత హరి కృష్ణ గారు, నాన్న తారక రామ్ గారు అందరు తనని ఆశీర్వదిస్తారని. ఎల్లప్పుడు తనతో ఉంటారని అలాగే నందమూరి అభిమానుల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పారు .

తనకోసం పూజ కార్యక్రమం చేసిన నందమూరి లక్ష్మి గారికి , ముహూర్తం షాట్ డైరెక్షన్ చేసిన లోకేశ్వరి గారికి , కెమెరా ఆన్ చేసిన పురందేశ్వరి గారికి , క్లాప్ కొట్టిన భువనేశ్వరి గారికి ఇలా వచ్చిన అమ్మమ్మ లు, నాన్నమ్మ లు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు .

NTR (NEW TALENT ROARS ) బ్యానర్ పై చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మించనున్నారు . వచ్చే ఏడాది లో ఈ చిత్రం ఘనంగా విడుదల చేయనున్నారు . ఈ చిత్రం లో వీణ రావు అనే తెలుగు అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది .

దర్శకుడు విషయానికొస్తే చాల సంవత్సరాల తర్వాత వై.వీ.ఎస్ చౌదరి గారి దర్శకత్వం లో వస్తున్న చిత్రం ఇది . ఎన్టీఆర్ గారితో సీతారాముల కళ్యాణం చూతము రారండి చిత్రం తో పరిచయమయ్యారు. హరి కృష్ణ, నాగార్జున గారి తో సీత రామ రాజు చిత్రం , మహేష్ బాబు తో యువరాజ్ ఇంకా లాహిరి లాహిరి లో,సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు, సలీం, రేయ్  చిత్రాలకు దర్శకత్వం వహించారు . మళ్ళీ చాల సంవత్సరాలు తరువాత ఈ చిత్రాని తెరకెకించనున్నారు.