Headlines
the indian house

“ది ఇండియన్ హౌస్” షూటింగ్ లో ప్రమాదం.

ది ఇండియన్ హౌస్ షూటింగ్ లో ప్రమాదం :

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న చిత్రం “ది ఇండియన్ హౌస్” చిత్ర షూటింగ్ లో పెద్ద ప్రమాదం జరిగింది. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం లో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం కొణిదల రామ్ చరణ్ గారు నిర్మించారు. ఈ చిత్రం 1905 లో జరిగిన కథా గా తెరకెక్కుతుంది. స్వాతంత్రం
కోసం పోరాడాలి అనే భారతీయులను ఉద్దెశించి తీసిన కథ ఇది. హీరో నిఖిల్ దేశ భక్తుడు గా కనిపిస్తాడు. అతడు ఇండియా నుంచి లండన్ కి వెళ్లి అక్కడ భారతీయులను స్వాతంత్రం కోసం పోరాడామని వారికి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. వారందరు కలవాడనికి ఏర్పాటు చేసుకున్న చోటే ఈ ది ఇండియన్ హౌస్ ఇక్కడే మన భారతీయులు దాక్కునే స్థలం మరియు స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ల దగ్గరనుంచి భారత దేశాన్ని ఎలా విడిపించాలో అని సన్నాహాలు వేసిన చోటు అది. ఈ నేపధ్యం లో సాగుతుంది ఈ కథ.

the indian house movie

ఈ చిత్రం షూటింగ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపం లో జరుగుతుంది, సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగలడం తో వారు ఉన్న లొకేషన్ అంత నీటిమయం అయ్యింది. అక్కడ ఉన్న కెమెరా లు, లైట్లు మిగిలిన ఎలక్ట్రానిక్ డివైస్ లు అన్ని ఆ నీటిలో మునిగిపోయాయి, దీనితో ఆ సినిమా సిబ్బంది కి తీవ్ర నష్టం కలిగింది, అంతే కాకా ఆ ఘటన లో అసిస్టెంట్ కెమెరామాన్ కు తీవ్ర గాయాలయ్యాయి, ఆయనతో పాటు సెట్ లో ఉన్న ఇంకొంత మంది కి గాయాలు అయ్యాయి దీనితో వారిని హాస్పిటల్ కి తరలించారు.