
శివభక్తి తారాగణం లో కన్నప్ప-ప్రభాస్ ఎంట్రీ తో ఫాన్స్ కి ఫీస్ట్ .
శివభక్తి తారాగణం లో కన్నప్ప :
కన్నప్ప సినిమా మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రేయిటీ ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జూన్ 27 2025 న విడుదల అయిన విషయం తెలిసిందే, ఈ చిత్రం పై ఎలాంటి టాక్ వచ్చిందో తెలుసుకుందాం.
ఈ చిత్రం ట్రైబల్ వర్గానికి చెందిన తిన్నడు అనే వ్యక్తి ఎలా శివ భక్తుడు గా మారుతాడు అనే నేపధ్యం లో సాగుతున్న కథ ఇది. ఈ చిత్రం విష్ణు మంచు తన క్యారెక్టర్ కి న్యాయం చేశారు. క్లైమాక్స్ లో పాత్ర కు భావోద్వేగాలను చాల బాగా వ్యక్తీకరించారు. మొదటి భాగం నత్త నడక గా సాగిన క్లైమాక్స్ లో మాత్రం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. కన్నప్ప చిత్రాన్ని శివతత్వానికి మోడరన్ టచ్ గా చూపించారు, మంచు మోహన్ బాబు తో సహా వారి కుటుంబం నుంచి విష్ణు మంచు గారి పిల్లలు ఈ చిత్రం లో ప్రత్యేక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ చిత్రం లో ప్రభాస్ ఎంట్రీ తో థియేటర్లు హోరెత్తాయ్. ఈ చిత్రం లో ప్రభాస్ పాత్ర 30 నిమిషాలే ఉన్నప్పటికీ ప్రభాస్ ఫాన్స్ కి ఫీస్ట్ గా ఈ చిత్రం నిలిచింది, క్యామియో తో చిత్రం హిట్ టాక్ వచ్చేలా చేసాయి.సినిమాటోగ్రఫీ బాగున్నప్పటికీ VFX విజువల్స్ సినిమా కు తగ్గట్టు గా లేవని విమర్శ జరిగింది. శివ భక్తి తారాగణం లో వచ్చినప్పటికీ ప్రేమ కథ, ఇతర సపోర్టింగ్ క్యారెక్టర్లు పాత్ర లు కథకు అవసరం లేనట్టు గా అనిపించడం వల్ల చిత్రానికి నెగటివ్ టాక్ ను ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 9 కోట్ల ఆదాయం వచిన్నట్టు గా సమాచారం, ఇండస్ట్రీ హిట్ గా భావించి చిత్రం ప్రధాన పాత్రల్లో నటించిన వారు సక్సెస్ మీట్ ను కూడా జరుపుకున్నారు. పౌరాణిక కథ కు ఆధునిక కథ గా తెరకెక్కిన ఈ చిత్రానికి 3 / 5 రేటింగ్ వచ్చింది.