Mahavatar Narasimha

కన్నడ విజయాలు: ‘మహావతార్’ & ‘సూ ఫ్రమ్ సో’ రికార్డులు.

కన్నడ సినిమా ‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ ఫిల్మ్ ఉత్తర-దక్షిణ భేదం లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హోంబలి నిర్మించిన ఈ చిత్రం నాలుగో వారంలోనూ సత్తా చాటుతోంది. అయితే, ఈ ప్రభంజనంలో మరో కన్నడ చిత్రం ‘సూ ఫ్రమ్ సో’ రేర్ రికార్డ్ సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ హారర్ కామెడీ ఫిల్మ్ 100 కోట్ల క్లబ్‌లో చేరి, కన్నడలో టాప్ 10 గ్రాసింగ్ చిత్రాల జాబితాలో స్థానం సంపాదించింది.
జూలై 25న కన్నడలో రిలీజ్ అయిన ‘సూ ఫ్రమ్ సో’ శాండల్‌వుడ్‌లో అద్భుత స్పందన పొంది, మలయాళం, తెలుగులో డబ్ చేయబడింది. మలయాళ ప్రేక్షకులు ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. రాజ్ బి శెట్టి నిర్మాతగా, కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం 34 కోట్ల బడ్జెట్‌తో 100.99 కోట్లు వసూలు చేసింది.

Su From So

కర్ణాటకలో 69.2 కోట్లు, మలయాళంలో 5.07 కోట్లు, తెలుగులో 1.23 కోట్లు సాధించింది. డైరెక్టర్ జేపి తుమ్మినాథ్ సులోచన దెయ్యం అలజడిని వినోదాత్మకంగా చూపించారు. కన్నడ ప్రేక్షకులు ఈ నీట్ కామెడీని ఆస్వాదిస్తున్నారు. థియేటర్ రన్ ముగిసే సమయానికి మరెన్ని రికార్డులు బద్దలవుతాయో చూడాలి.