
అఖండ 2 టీజర్ రిలీజ్ – శివ తాండవ రూపం లో బాలయ్య.
అఖండ 2 టీజర్ రిలీజ్ – శివ తాండవ రూపం లో బాలయ్య :
ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది, నందమూరి బాలకృష్ణ గారి 65 వ పుట్టిన రోజు సందర్బంగా అఖండ తాండవం 2 టీజర్ ని రిలీజ్ చేసారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను, థమన్ కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా సీక్వెల్ ఈ అఖండ తాండవం 2. నిన్న సాయంత్రం రిలీజ్ అయినా ఈ టీజర్ అభిమానులకు ఎంతగానో నచ్చింది.
మంచు గుట్టల మధ్యలో బాలకృష్ణ గారు భారీ త్రిశూలం తో శత్రువులను దాడి చేసే విధానం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. బాలకృష్ణ గారి లుక్స్ విషయానికొస్తే 65 ఏళ్ళ వయసులో కూడా ఆయన లుక్, ఎనర్జీ లెవెల్స్ అన్ని వేరే లెవెల్. అఖండ సినిమా లో ఉన్న అఘోర లుక్ నే ఇంకొంచం వైల్డ్ గా చేసారు. ” GOD OF MASSES “ గా పిలవబడే ఈయన అఖండ 2 తాండవం టీజర్ తో అభిమానులకు పూనకాలు తెప్పించారు.
బాలకృష్ణ అంటే పవర్ఫుల్ డైలాగ్స్ అలాంటిది బోయపాటి తో సినిమా అంటే ఇంకా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి అనే విషయం తెల్సిందే. టీజర్ లో వచ్చిన ఒక డైలాగు మాత్రం అభినులను ఉర్రుతలూగిస్తుంది ” నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైన కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా ? అమాయకుల ప్రాణాలు తీస్తావా “ అంటూ అయన విసిరినా డైలాగ్ త్రిశూలం కంటే ఫాస్ట్ గా అభిమానులకు రీచ్ అయ్యింది. బాలయ్య గారికి ఇంకా హైప్ ఇచ్చేది థమన్ గారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. థమన్ ఇచ్చిన బాచ్ గ్రౌండ్ స్కోర్ ‘తగ తగ తగ తాండవం” అంటూ వస్తుంటే నిజంగా శివ తాండవం ని చూసినట్లు గానే ఉంది.
ఈ 1.17 సెకండ్స్ టీజర్ తోనే ఇంత విధ్వంసం సృష్టిస్తే ఇంకా సినిమా ఎలా ఉండబోతుందో ఇండస్ట్రీ ని ఎలా షాక్ చేయబోతుందో చూడాలంటే సెప్టెంబర్ వరకు వేచి చూడాల్సిందే.ఈ సినిమా ని 2025 సెప్టెంబర్ 25 న విడుదల చేయనున్నారు. అదే రోజు పవన్ కళ్యాణ్ OG సినిమా కూడా విడుదల కి సిద్ధంగా ఉండడం ప్రేక్షకులను సందిగ్ధం లో పడేసింది. ఒకే రోజు ఇద్దరు టాప్ హీరోల చిత్రాలు విడుదల అవ్వడం విశేషం అయినప్పటికీ ఏ సినిమా చూడాలో అనే అయోమయం లో ఉంటారు ప్రేక్షకులు.