
రైల్వే రిక్రూట్మెంట్ 2025 : 904 అప్రెంటిస్ పోస్టుల భర్తీ
నోటిఫికేషన్ వివరాలు :
మొత్తం పోస్ట్‌లు : 904
రైల్వే రిక్రూట్మెంట్ 2025 భారత రైల్వే శాఖ నుంచి సౌత్ వెస్టర్న్ రైల్వే 904 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ కోసం ఎలాంటి పరీక్ష లేదా రన్నింగ్ టెస్ట్ ఉండదు. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా భారతీయ పౌరులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు :
దరఖాస్తుదారులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్ వంటి ట్రేడ్లలో ఎన్సీవీటీ/ఎస్సీవీటీ ఆమోదిత ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ వారికి 27 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 29 సంవత్సరాలు, దివ్యాంగులకు 34 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంది.
దరఖాస్తు ప్రక్రియ :
దరఖాస్తు ప్రక్రియ జులై 14, 2025 నుంచి ప్రారంభమై, ఆగస్టు 13, 2025 వరకు కొనసాగుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు దరఖాస్తు రుసుము మినహాయింపు ఉంది. ఇతరులు రూ.100 రుసుము చెల్లించాలి. ఆన్లైన్ లింక్ నోటిఫికేషన్లో లభిస్తుంది.
ఆన్లైన్ దరఖాస్తు :
దరఖాస్తు ప్రారంభం : 14-07-2025
దరఖాస్తు ముగింపు : 13-08-2025
ఎంపిక విధానం :
ఎంపిక ప్రక్రియలో పరీక్షలు, స్కిల్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలు ఉండవు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఒక సంవత్సరం శిక్షణ ఇస్తారు, ఆ తర్వాత సర్టిఫికెట్ అందజేస్తారు.
అవకాశాలు :
ఈ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ రైల్వేలో గ్రూప్-డి, టెక్నీషియన్ వంటి శాశ్వత ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తుంది. 10వ తరగతి, ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.