బ్యాంక్ అఫ్ బరోడా లో ఉద్యోగాలు : వెంటనే దరఖాస్తు చేసుకోండి !
బ్యాంక్ అఫ్ బరోడా ఇటీవల లోకల్ బ్యాంకు ఆఫీసర్(LBO) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన వివరాలు చూద్దాం. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అఫిషియల్ వెబ్సైటు లో నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించి అప్లై చేసుకోగలరు.
ఆన్‌లైన్ దరఖాస్తు :
దరఖాస్తు ప్రారంభం : 04 -07-2025
దరఖాస్తు ముగింపు : 24-07-2025
మొత్తం పోస్ట్లు : 2500(LBO)
విద్య అర్హత : ఏదైనా విభాగం లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి : జులై 1 నాటికి 21 సంవత్సరాల నుండి ౩౦ సంవత్సరాల మధ్యలో ఉండాలి.
వయోపరిమితి సడలింపు :
SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు.
OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు.
PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు.
EX SERVICEMAN ల కు నియామకాల ప్రకారం వయో పరిమితి సడలింపు వర్తిస్తది.
ఈ నోటిఫికేషన్ కి కొత్త నిబంధనను ప్రవేశ పెట్టారు, లోన్ లు తీసుకోడానికే కాకుండా ఉద్యోగం చేయడానికి కూడా CIBIL స్కోర్ నిబంధనను ప్రవేశ పెట్టారు. దరఖాస్తు దారులకి కనీస సిబిల్ స్కోర్ 680 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇది ఒక ముఖ్యమైన నిబంధన కాబట్టి దరఖాస్తు దారులు చూసుకొని అప్లై చేసుకోగలరు. సిబిల్ స్కోర్ లేని వారికి ఇది వర్తించదు.
ఇందుకుగాను అప్లికేషన్ ఫీ జనరల్/OBC / EWC వారికి: రూ.850 /-
SC/ ST/ ESM/ PWDS/ ట్రాన్స్ జెండర్ / మైనారిటీ/ మహిళా/ ఈబీసీ వారికి: రూ. 175/- ఫి చెల్లింపులు ఆన్‌లైన్ లో చేయవచ్చు.
అర్హత గలవారు కేవలం బ్యాంక్ అఫ్ బరోడా అధికారిక వెబ్సైటు లో నే దరఖాస్తు చేసుకోగలరు.
ఆఫీషియల్ వెబ్సైటు – www.bankofbaroda.in