ఎలోన్ మస్క్ కొత్త పార్టీ- రాజకీయాల్లో సరికొత్త అడుగు.
ఎలోన్ మస్క్ కొత్త పార్టీ – రాజకీయాల్లో సరికొత్త అడుగు:
ప్రపంచంలో నే అత్యంత ధనవంతుడైన SpaceX మరియు Tesla కంపెనీ స్థాపకుడు మరియు సీఈఓ ఎలోన్ మస్క్ తాజాగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తానే స్వయంగా ఒక కొత్త పార్టీ ని స్థాపిస్తునట్టు ప్రకటించారు. జులై 4 న అమెరికా పౌరులు స్వతంత్ర వేడుక ల ను జరుపుకుంటున్న సందర్భంలో ఎలోన్ మస్క్ తన కాత లో అమెరికా ప్రజలు నూతన రాజకీయ పార్టీ ని కోరుకుంటున్నారా లేదా అని ఒక సర్వే ని నిర్వహించారు ఆ సర్వే లో 64.5 శాతం మంది ప్రజలు కొత్త పార్టీ ని కోరుకుంటున్నట్టు తమ అభిప్రాయాన్ని తెలిపారు.
కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు ‘ది అమెరికా పార్టీ’ స్థాపిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని మస్క్ పేర్కొన్నారు. ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.ఇటీవల అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన “వన్ బిగ్, బ్యూటిఫుల్ బిల్” (One Big, Beautiful Bill) పైనే ఈ నిర్ణయానికి నాంది పలికింది. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన మస్క్, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను అప్పుల ఊబిలోకి నెడుతుందని ఆరోపించారు. బిల్లు చట్టంగా మారిన వెంటనే తాను ఈ ప్రకటన చేసారు.