Headlines
TRUMP TRAVEL BAN

ట్రంప్ కొత్త ట్రావెల్ బాన్: 19 దేశాలపై ఆంక్షలు.

ట్రంప్ కొత్త ట్రావెల్ బాన్ : 19 దేశాలపై ఆంక్షలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 19 దేశాలపై కొత్త, విస్తృత ట్రావెల్ బాన్‌ను ప్రకటించారు. ఈ ఆదేశం ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సోమాలియా, లిబియా, సూడాన్, యెమెన్, మయన్మార్, ఎరిట్రియా, చాద్, కాంగో, హైతీ, ఈక్వటోరియల్ గినియా దేశాలపై పూర్తి ఎంట్రీ నిషేధం విధించబడింది. వెనిజులా, క్యూబా, టోగో, లావోస్, తుర్కమెనిస్తాన్, బురుండి, సియెర్రా లియోన్‌లపై భాగశాతం వీసా ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలకు కారణాలుగా అధిక వీసా ఓవర్‌స్టేలు, డిపోర్టేషన్‌లో సహకారం లేకపోవడం, భద్రతా తనిఖీలలో లోపాలను ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది.

TRUMP TRAVEL BAN

ట్రంప్ మాట్లాడుతూ, “మనం సురక్షితంగా తనిఖీ చేయలేని దేశాల నుంచి వలసలను అనుమతించలేం” అని అన్నారు. తీవ్రవాదుల ఉనికి, వీసా భద్రతలో సహకారం లేకపోవడం, ప్రయాణీకుల గుర్తింపు తనిఖీలో వైఫల్యం, నేర చరిత్రల రికార్డుల లోపం వంటి జాతీయ భద్రతా బెదిరింపులను పరిగణనలోకి తీసుకున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. ఈ బాన్ జూన్ 9 నుంచి అమలులోకి రానుంది.

2017లో ట్రంప్ ఏడు ముస్లిం దేశాలపై విధించిన “ముస్లిం బాన్” వివాదాస్పదమై, కోర్టుల జోక్యంతో రెండుసార్లు సవరించబడింది. 2025లో 19 దేశాలపై ఆంక్షలు విధించినప్పటికీ, పాకిస్తాన్ జాబితాలో లేకపోవడం విమర్శలకు దారితీసింది. ఉగ్రవాద సంబంధాలు, బలహీనమైన తనిఖీ వ్యవస్థ ఉన్నప్పటికీ పాకిస్తాన్‌ను మినహాయించడంపై విమర్శకులు అమెరికా వైఖరిని ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మ చేలానీ వంటి వ్యాఖ్యాతలు, మయన్మార్‌పై ఆంక్షలు విధిస్తూనే పాకిస్తాన్‌ను విస్మరించడం అమెరికా డీప్ స్టేట్ విధానాన్ని సూచిస్తుందని అభిప్రాయపడ్డారు.