
టెక్సాస్ లో వరద భీభత్సం- ప్రాణాలు తీస్తున్న వరదలు.
టెక్సాస్ లో వరద భీభత్సం- ప్రాణాలు తీస్తున్న వరదలు :
టెక్సాస్ లో భారీ వర్షాలు కారణం గా తీవ్రమైన వరద సంభవించింది. సెంట్రల్ టెక్సాస్ లో ని హిల్ కంట్రీ ప్రాంతం తీవ్రమైన వరదలతో అల్లకల్లోలం అయ్యింది. రెండు రోజుల భారీ వార్షానికి టెక్సాస్ రాష్ట్రం ఊహించని విధంగా వరదల తో అతలాకుతలం అయ్యింది.
జులై 4 మరియు జులై 5 తేదీలలో కురిసిన వర్షం, 5 నుంచి 10 అంగుళాల వర్ష పాతం నమోదయ్యింది. వర్ష పాతం ఎక్కువ ఉండటం వల్ల వరద ప్రళయం లా మారింది. వరద తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల భారీగా ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగింది.
అధిక వర్ష పాతం వల్ల గ్వాడాలుపే నది ఒక్కసారిగా ప్రమాద స్థాయిలో ఉప్పొంగి ప్రవహించింది. హంట్, కెర్విల్లే, కంఫర్ట్ వంటి ప్రాంతాల్లో నదీ మట్టాలు రికార్డు స్థాయికి ప్రవాహం పెరిగాయి. హంట్‌లో కేవలం 2 గంటల వ్యవధి లోనే నది 22 అడుగులు పెరిగి, 29 అడుగుల దగ్గర గేజ్ పనిచేయడం ఆగిపోయింది.
ఈ ఆకస్మిక వరదల వల్ల ఇప్పటికి 25 మంది మృతి చెందగా చాలా మంది గల్లంతయ్యారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే క్యాంప్ మిస్టిక్ సమ్మర్ క్యాంపు కోసం వచ్చిన 20 నుండి 25 చిన్నారులు కూడా చాలా మంది గల్లంతయ్యారు. పిల్లల ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నారు, గల్లంతైన బాలికల కోసం వారి కుటుంభం సభ్యులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆకస్మిక వరదల వల్ల ప్రజల కి హెచ్చరిక జారీ చేసేలోపే వరద నీళ్లు ఇళ్లలోకి, రోడ్ల ని ముంచెత్తాయి. దాన్ని వల్లనే అధిక ప్రాణ నష్టం జరిగింది. మృతి చెందిన వారిలో పిల్లలు, పెద్దలు కూడా ఉన్నారు. కెర్ కౌంటీ ప్రాంతం లో 24 మంది మృతి చెందగా , ఒకరు కెండాల్ కౌంటీ ప్రాంతం లో ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అని అధికారులు హెచ్చరించారు.
ఇప్పటికి 200 మంది పైగా ప్రజలను వరదల్లోంచి కాపాడారు, ప్రజలను హెలికాఫ్టర్ లా సహాయం తో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 400 పైగా ఎమర్జెన్సీ సిబ్బంది, దాదాపు 9 రెస్క్యూ టీం లు ఉన్నారు. అంతేకాకుండా 14 హెలికాఫ్టర్ లు, 12 డ్రోన్ లను ఈ సహాయక చర్యల్లో ఉపయోగిస్తున్నారు.
వరద ప్రవాహం తీవ్రంగా ఉండటం వల్ల అనేక రహదారులు, వాహనాలు అన్ని కొట్టుకుపోయాయి, రవాణా సంస్థ పూర్తిగా స్తంభించిపోయింది, వరద నీటితో ఇళ్లన్నీ మునిగిపోయాయి. ప్రజలు ప్రాణాలను కాపాడుకోడానికి ఇంటి పై కప్పులు మరి చెట్లని ఎక్కి ప్రాణాలు కాపాడుకొనే పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ సరఫరా మరియు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం తో ప్రజల మధ్య కమ్యూనికేషన్ దెబ్బతిన్నది. వరద తీవ్రత ఎక్కువ గా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుంది.
ఈ వరదలు ‘భయంకరమైన వరదలు’ అని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తామని కావలసిన సహాయక చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.