
నేరేడు పళ్ళు – ఆరోగ్యానికి సహజ ఔషధం.
నేరేడు పళ్ళు – ఆరోగ్యానికి సహజ ఔషధం :
నేరేడు పళ్ళు వల్ల చాలా ఆరోగ్య లాభాలు. నేరేడు పళ్ళు, జామున్ లేదా బ్లాక్ ప్లం ఈ పండు జూన్, జులై నెలలో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు :
రోగ నిరోధక శక్తి : నేరేడు పండ్లలో విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరగడానికి తోడ్పడుతుంది.
డయాబెటిస్ కంట్రోల్ : నేరేడు పండ్లు రక్తం లో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడం లో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరం గా ఉంటుంది. ఇది రక్తం లో షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది.
జీర్ణక్రియ పెంచుతుంది : నేరేడు పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల జీర్ణ క్రియ ని మెరుగు పరుస్తుంది మరియు మలబద్దకాన్ని తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని పెంచుతుంది.
చర్మ సమస్యలు : నేరేడు పండ్లలో అంటి ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి ఎక్కువ ఉండటం వల్ల చర్మ ఆరోగ్యం పెంచడానికి సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలు, అలెర్జీలు తగ్గిస్తుంది. చర్మం యొక్క సహజ రంగు పెరగడానికి తోడ్పడుతుంది.
గుండె సమస్యలు : ఈ పండ్లు గుండె ను ఆరోగ్యకరంగా ఉంచుతుంది ఈ పండ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించి గుండె పోటు రాకుండా చేస్తుంది.
శ్వాసకోశ సమస్యలు : బాక్టీరియా ఇన్ఫెక్షన్స్, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
రక్త హీనత : ఈ పండ్లు తినడం వల్ల క్రమంగా రక్తం పెరిగి రక్త హీనత తగ్గుతుంది.
రక్త పోటు : నేరేడు పండ్లలో పొటాషియం, యాంటీఆక్సిడాంట్లు రక్త పోటు ని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతాయి.
కిడ్నీ లో రాళ్ళూ : ఈ పండ్లలో ఉన్న యాంటియోక్సిడెంట్ల వల్ల కొంత మేరకు కిడ్నీ లో రాళ్ళూ ఏర్పడకుండా చూస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది.
నేరేడు పండ్లతో పాటు నేరేడు గింజలతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ గింజల పొడి తో డయాబెటిస్ కి మందులను కూడా తాయారు చేస్తారు.