Headlines
Nalleru Kada

నల్లేరు కాడ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.

నల్లేరు కాడ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఈ ప్రకృతి లో మనకి ఎన్నో తెలియని చాలా ఔషధ మొక్కలు ఉన్నాయి అందులోని ఒక్కటి నల్లేరు కాడ ల మొక్క. ఈ మొక్క తీగ జాతికి సంబంధించినది, దీన్ని వజ్రవల్లి ,అస్థి సంహరణ, అస్థి సంధాన, అనే పేరున కూడా పిలుస్తారు.నల్లేరు తో చాలా ఉపయోగాలు ఉన్నాయి, దీన్ని తినడం వల్ల చాలా విశేష లాభాలు ఉన్నాయ్.

పల్లెటూర్ల లో ఉన్న వాళ్లకి ఈ మొక్క గురించి ఎక్కువగా తెలిసి ఉంటుంది. పంట పొలాల్లో,  కూరగాయ మొక్కలతో పాటు ఈ కాడల్ని పాదుల మధ్య,గట్ల మీద అక్కడక్కడ పెంచుతారు. ఇవ్వి అలా పెంచడానికి కారణం ఏంటి అంటే కూరగాయల్ని కొరకకుండా ఉండటానికి వేస్తారు నల్లేరు కాడలని, కొరికిన, కోసిన దురద వస్తది కాబట్టి ఇలా పెంచుతారు.

ఈ మొక్క గుబురు గుబురు గా పొదల్లో కనిపిస్తాయి, ఒక్క కాడ నాటితే చాలు వాటంతట అవే అంత విస్తరించి తీగ అల్లుకుపోతాయి.
దీని ప్రత్యేకత ఏమిటి అంటే విరిగిన ఎముకలని సైతం అతికించే సామర్ధ్యం గల మొక్క.ఈ కాడలని మనం ఏ విధంగా గా ఐనా తీస్కోవచ్చు పచ్చడి, పొడి, పప్పు, పులుసు ఇలా చాలా రకాలు గా చేస్కోవచ్చు. కానీ ఈ కాడలను కోసేటప్పుడు మాత్రం చేతికి నూనె కచ్చితంగా రాసుకోవాలి లేదంటే చేతులు దురద వస్తాయి.


నల్లేరు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం :

  • నల్లేరు కాడకు విరిగిన ఎముకల్ని అతికించే శక్తి ఉంది, నల్లేరు కాడను “హడ్డు జోడించేది” అని కూడా అంటారు. కాల్షియమ్, విటమిన్ సి ఉండటం వల్ల ఎముకల కు కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
  • ఆర్తరైటిస్, జాయింట్ పెయిన్స్, చిన్న గాయాలు ఉన్నవారికి నొప్పులు నుంచి విముక్తి ని ఇస్తుంది. శరీరంలో తీవ్రమైన వాపు, నొప్పిని కూడా తగ్గిస్తుంది.
  • ఈ కాడ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అరుగుదల సమస్యలు కూడా తగ్గిపోతాయి. మలబద్దకం, అజీర్తి లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
  • నల్లేరు తినడం వల్ల షుగర్ కూడా కంట్రోల్ ఉంటది అంతే కాకుండా బరువు కూడా తగ్గుతారు, నల్లేరు కొవ్వు కణాలను ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటది.

నల్లేరు ని తీసుకోవడానికి జాగ్రత్తలు :

ఈ కాడను కోసేముందు చేతికి నూనె రాసుకొని కొయ్యాలి లేదంటే చేతులు దురద వస్తాయి.
గర్భవతులు,పిల్లలు లేదా మందులు వాడే వారు ఈ కాడను తినే ముందు వారి వైద్యుల సలహా మేరకు తినాలి.
అధికంగా తింటే కొందరికి వికారం, అజీర్తి వంటి ఇబ్బందులు రావచ్చు.