
ఆలస్యంగా వెలుగు లో కి వచ్చిన 4.58 కోట్ల స్కాం.
ఆలస్యంగా వెలుగు లో కి వచ్చిన 4.58 కోట్ల రూపాయల స్కాం :
సాక్షి గుప్తా రాజస్థాన్ లోని కోటలోని DCM (Delhi Cloth Mills) ప్రాంతం లో, శ్రీరామ్ నగర్ బ్రాంచ్ లో, ఐసీఐసీఐ బ్యాంకు రిలేషన్షిప్ మేనేజర్ గా పని చేసేది. ఆమె పని చేసే బ్యాంకు లో దాదాపు 4.58 కోట్ల రూపాయల స్కాం కు పాల్పడింది. ఈ స్కాం 2023 ఫిబ్రవరి 18న మొదటి సారి వెలుగులోకి వచ్చింది. ఒక ఖాతాదారుడు వచ్చి వాళ్ల ఖాతా స్టేట్మెంట్ అడగగా ,బ్యాంకు స్టాఫ్ స్టేట్మెంట్ లేదు అని తెలియపరిచారు. ఇంటర్నేషనల్ ఆడిట్ టీం వచ్చి మొత్తం పత్రాలను పరిశీలించగా ఖాతాదారుల ఫోన్ నెంబర్ లు మార్చడం, పిన్ లు ,డెబిట్ కార్డులు మార్చి డబ్బు మార్పిడి జరిగినట్టు గా తెలిసింది. ఇది స్కామ్ గా గుర్తించి, మేనేజర్ FIR ఫైల్ చేసాడు. 2023 మార్చి నాటి నుండి విచారణ మెదలు పెట్టారు.
పోలీస్లు విచారణ చేయగా, ఆవిడా (2020 -2023 )మూడు సంవత్సరంలో 41 మంది ఖాతాదారుల ,110ఖాతాల నుండి మొత్తం డబ్బు ని తీసింది.
- FD (ఫిక్స్డ్ డిపాసిట్లు)
- వృద్ధ మహిళా ఖాత
- సేవింగ్స్ ఖాతాలు
- ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్లు
ఆ డబ్బును స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టింది, కానీ అనుకోని రీతిలో ఆమెకి నష్టం వాటిల్లింది . ఖాతాదారుల ఫోన్ నెంబర్ లు మార్చి, గుప్తా కుటుంబ సభ్యుల నంబర్లను అమర్చింది. ఓటీపీ లు, పిన్ లు, డెబిట్ కార్డులు మార్చి డబ్బు ని ఆమె ఖాతాలోకి పంపుకుంది. ఇది అంత ఉద్యోగనగర్ పోలీస్ SI ఇబ్రహీం తెలిపారు.
ఈ స్కామ్ బయట పడ్డాక బ్యాంకు అధికారులు ఎవరికీ నష్టం జరగదు అని, ఈ పని చేసిన గుప్తా ని సస్పెండ్ చేసి అరెస్ట్ చేపిస్తాం, FIR ఫైల్ చేసాం అని, బ్యాంకు భద్రత చర్యలు పెంచుతాం, అని హామీ ఇచ్చారు .ఈ పని రిలేషన్షిప్ మేనేజర్ అయిన గుప్తా చేసింది అని తెలిసాక , ఆమెని 2025 మే 31 వ తేదీన అరెస్ట్ చేసిన ఉద్యోగ నగర్ పోలీసులు. ప్రస్తుతం న్యాయ కస్టడీ లో ఉంచారు. సాక్షి గుప్తా అపహరించిన డబ్బు ఇంకా తిరిగి ఇవ్వలేదు .