
భాగ్యనగరానికి తరలి వస్తున్న అందగత్తెలు-మిస్ వరల్డ్ 2025
మిస్ వరల్డ్ 2025 సౌందర్య పోటీలు ఈసారి హైదరాబాద్ తెలంగాణ లో వేదిక అవ్వడం చాలా అద్భుతమైన విషయం, పోటీలకు సర్వం సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం.
10 – 31 వరకు జరగనున్న ఈ పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో గ్రాండ్ గా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవంకి టాలీవుడ్ బాలీవుడ్ సెలెబ్రిటీలు రానున్నారు.
ఈ నెల జరగనున్న అందాల పోటీలు 72 వ ఎడిషన్ . ఈ పోటీలకు 120 దేశాల నుంచి రానున్న పోటీదారులు. ఇప్పటికే భాగ్యనగరం చేరుకున్న చాలా దేశాల సుందరీమణులు .
భాగ్యనగరం చేరుకున్న ఈ పోటీదారులు కు ఘనంగా స్వాగతం చెప్తున్నారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి భారతదేశ సంస్కృతులతో శాస్త్రీయ పద్ధతుల్లోనూ వారికి ఆహ్వానం చేస్తున్నారు బొట్టు పెట్టి పూల మాల వేసి భరతనాట్యం, కూచిపూడి, కథక్, పేరని నృత్యాలతో వారికి స్వాగతం చెప్పారు.
మిస్ వరల్డ్ 2025 పోటీలు ఈ నెల 10 నుంచి 31 వరకు జరగనున్నాయి. పోటీదారులు అందరికి 5 స్టార్ రెస్టారెంట్స్ లో ఆతిధ్యం ఇస్తున్నారు. 24 /7 పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు ఎప్పుడు మానిటర్ చేసేలాగా డ్రోన్స్తో, కెమెరా తో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు .
13వ తారీకున చార్మినార్ నుంచి చౌమహల్లా పాలస్ వరకు హెరిటేజ్ వాక్ చేయనున్నారు. ప్యాలెస్ లో 38 రకాల వంటకాలతో వారికి స్పెషల్ లంచ్ ఏర్పాటు చేయనున్నారు.
15 వ తారీకున యాదాద్రి, పోచంపల్లి సందర్శించనున్నారు. పోచంపల్లి లో మన సాంప్రదాయమైన చీరలో రాంప్ వాక్ నిర్వహించనున్నారు. మే 20 న అనాధ ఆశ్రమం కి వెళ్లి పిల్లలతో సమయం గడపనున్నారు .
తర్వాత మన తెలంగాణలో ఉన్న అన్ని సందర్శక ప్రాంతాలు రామోజీ ఫిలిం సిటీ, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ , శిల్పారామం , వరంగల్ సిటీ లో గల రామప్ప, వెయ్యి స్థంబాల గుడి, పాలమూరు పిల్లల మర్రి, నల్లగొండ లో ని బుద్ధవనం ఇలా తెలంగాణ లో ఉన్న అని ఫేమస్ ప్రదేశాలని చూస్తారు .
ఇలా అన్ని ప్రదేశాలు చూడటం వాళ్ళ మన తెలంగాణ కి టూరిజం పెరిగే అవకాశాలు ఉన్నాయ్ అని మరియు టూరిజం ప్రొమోషన్స్, పెట్టుబడులకు అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు.
మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని అంచనా వేస్తున్నారు.