
విడుదలు అయిన తెలంగాణ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.
ముఖ్యమంత్రి గారి చే విడుదలు అయిన తెలంగాణ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.
నిన్న మధ్యాహ్నం రవీంద్రభారతీ లో జరిగిన బసవేశ్వర జయంతి వేడుకలలో తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు పదవ తరగతి పరీక్ష ఫలితాలను విడుదలు చేసారు.
ఈ ఏడాది పదవ తరగతి పరీక్ష కి మొత్తం 509564 విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 507107 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.
వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 496374 కాగా ప్రైవేట్ విద్యార్థులు 10733 . ఈ ఏడాది ప్రైవేట్ స్కూల్స్ కన్నా సోషల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులు ఎక్కువ శాతం మార్కులు స్కోర్ చేశారు.
అయితే రెగ్యులర్ విద్యార్థులు 92 .78 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు చేయగా , ప్రైవేట్ విద్యార్థులు 57 .22 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు చేసారు .
వీరిలో రెగ్యులర్ అమ్మాయిలు 94.26 శాతం పాస్ పర్సంటేజ్ ఉండగా, అబ్బాయిలు 91 .32 శాతం పాస్ పర్సంటేజ్ ఉంది.
ఇక ప్రైవేట్ విషయం కి వస్తే అమ్మాయిలు 61 .70 శాతంపాస్ పర్సంటేజ్ ఉండగా , అబ్బాయిల ది 55.14 శాతం గా ఉంది .