Business Archives - TelAndra.com

అనిల్ అంబాని షాక్: 3,716 కోట్ల నివాసం ఈడీ కబ్జా
అనిల్ అంబానికి మరో గట్టి దెబ్బ తగిలింది. మనీలాండరింగ్ దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబైలోని పాలీ హిల్ ప్రాంతంలో ఉన్న అనిల్ అంబాని విలాసవంతమైన నివాసాన్ని అటాచ్ చేసింది. ‘అబోడ్’ అనే ఈ భవనం సుమారు 3,716.83 కోట్ల రూపాయల విలువ కలిగి ఉంది. 17 అంతస్తులతో, 66 మీటర్ల ఎత్తున్న ఈ ఆధునిక నివాసం ముంబైలోని అత్యంత ఖరీదైన ఆస్తుల్లో ఒకటిగా పేరుపొందింది.

ఈ చర్యతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) సంబంధిత కేసులో ఇప్పటివరకు అటాచ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ 15,700 కోట్ల రూపాయలకు చేరుకుంది. గతంలో ఈ భవనంలో భాగం (473 కోట్ల విలువ)ను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది. ఇప్పుడు మొత్తం ఆస్తిని తాత్కాలికంగా జప్తు చేసే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆస్తి అనిల్ అంబాని కుటుంబ సభ్యుల ప్రైవేట్ ట్రస్ట్‌లో భాగమని దర్యాప్తు సంస్థ వెల్లడించింది.

ఈ కేసు ఆర్‌కామ్ సంస్థ ద్వారా దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో సుమారు 40,185 కోట్ల రూపాయలు బకాయిపడినట్టు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకులు నమోదు చేసిన మోసం, రుణ మోసం కేసుల ఆధారంగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌పై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద ఈ చర్యలు జరుగుతున్నాయి.

అనిల్ అంబాని, అతని భార్య తినా అంబాని సహా సంబంధిత వ్యక్తులు, సంస్థలపై బహుళ మనీలాండరింగ్ కేసులు ఉన్నాయి. ఈడీ అతన్ని గతంలో రెండుసార్లు సమన్లు జారీ చేసినా హాజరు కాలేదు. ఇప్పుడు ఫిబ్రవరి 26న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని కొత్త సమన్లు పంపింది. ఇది అతని రెండో దఫా విచారణ కావచ్చు.

ఈ ఘటన రిలయన్స్ గ్రూప్ ఆర్థిక సమస్యలు, రుణ బకాయిలు, దర్యాప్తులపై మరింత దృష్టి సారించింది.

The post అనిల్ అంబాని షాక్: 3,716 కోట్ల నివాసం ఈడీ కబ్జా appeared first on TelAndra.com.

వెండి క్రాష్: ₹15,000 ఒక్క రోజే పడిపోయింది!
హైదరాబాద్‌: బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు మరింత దిగజారుతున్నాయి. ఒక్కరోజు ఏకంగా ₹15,000 తగ్గిన వెండి ధర ఇప్పుడు కేజీకి ₹2,85,000కు చేరుకుంది. కొన్ని వారాల క్రితం ₹4 లక్షలు దాటిన సిల్వర్ ధర ఇలా భారీగా కుప్పకూలడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. గత వారంలోనే సుమారు ₹50,000 తగ్గిన వెండి, రానున్న రోజుల్లో కూడా హెచ్చు తగ్గులు కొనసాగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

“ఎంతగా మిడిసి పడిందో అంతగా తరిగిపోతుంది. మళ్లీ పాత రేట్లకు చేరుకునేందుకు సమయం పడుతుంది” అని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. మంగళవారం ఒక్క రోజే ₹15,000 పతనం నమోదైంది. ఇది కేవలం ఒక రోజు పతనం కాదు, వారం రోజుల్లోనే భారీ నష్టం. ధరలు ఎక్కువైనప్పుడు లాభాలు బుక్ చేసుకోవడం (ప్రాఫిట్ బుకింగ్) పెరగడం, షార్ట్ సెల్లింగ్‌లు పెరగడం ఇందుకు ప్రధాన కారణాలు.

అమెరికా డాలర్ బలపడటం కూడా వెండిని కరిగిస్తోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఉన్న అనిశ్చితి, ట్రంప్ ప్రభుత్వం తీసుకునే టారిఫ్ పాలసీలు, ట్రేడ్ యుద్ధాలు – ఇవన్నీ సేఫ్ హెవెన్‌గా భావించే వెండిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మార్కెట్‌లో అనిశ్చితి నెలకొన్నంత మేరకు వెండి ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి.

అయితే బంగారం ధరలు వెండి తరహాలో భారీ పతనం చెందడం లేదు. 24 క్యారెట్ తులం బంగారం ధర ₹430 పెరిగి, 10 గ్రాముల బంగారం ₹61,780కు స్థిరంగా ఉంది. బంగారంలో కేవలం చిన్న చిన్న హెచ్చు తగ్గులు మాత్రమే కనిపిస్తున్నాయి.

బులియన్ మార్కెట్ నిపుణులు రానున్న రోజుల్లో రెండు లోహాల ధరల్లోనూ హెచ్చు తగ్గులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని, ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం సిల్వర్ కొనుగోలుదారులకు అవకాశం ఉన్నప్పటికీ, మార్కెట్ ట్రెండ్‌ను జాగ్రత్తగా గమనించాలని నిపుణుల సలహా.

The post వెండి క్రాష్: ₹15,000 ఒక్క రోజే పడిపోయింది! appeared first on TelAndra.com.

చేనేత రంగం: కళకళల నుంచి కన్నీళ్ల వరకు
భారత సంస్కృతి, స్వాతంత్ర పోరాటంలో చేనేత ఎంతో కీలకం. ఆరుగజాల చీరలు ప్రపంచాన్ని ముగ్గు చేశాయి. కానీ ఇప్పుడు ఆ మగ్గాలు మూలకు చేరుతున్నాయి. ఉదయం 5 నుంచి రాత్రి 11 వరకు కష్టపడినా రోజుకి 500-1000 రూపాయలు కూడా రావడం లేదు. నెల్లూరు జిల్లా వెంకటగిరి, ఆత్మకూరు, కొవ్వూరు, పడుగుపాడు వంటి ప్రాంతాల్లో లక్షలాది మంది చేనేత కుటుంబాలు ఈ దుర్భర జీవితం అనుభవిస్తున్నాయి.

“మా ఇంట్లో అందరం కలిసి నేస్తే కూడా రోజుకి 500 రావడం లేదు సార్” అని వెంకటగిరి చేనేత కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరు “గతంలో 130 యూనిట్లకు 600 రూ. బిల్లు వచ్చేది, ఇప్పుడు 850 పైచిలుకు వస్తోంది. సగం సంపాదన కరెంట్‌కే వెళ్తోంది” అని చెప్పారు. యువత మగ్గం నేర్చుకోవడం మానేసింది. ఇతర పనుల్లో ఎక్కువ ఆదాయం, అనారోగ్యాలు, అప్పులు – ఇవన్నీ కారణం.

గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ‘నేతన్న నేస్తం’ పథకంతో ఏడాదికి 24,000 రూ. సహాయం చేసి, 100 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకం ఊసే లేదు. చంద్రబాబు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ ఇంకా అమలు కాలేదు. ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని క్యాబినెట్ చెప్పినా, నేతన్నలు ఇంకా ఎదురుచూస్తున్నారు.

నేతన్నల డిమాండ్లు స్పష్టం: నేతన్న నేస్తం వెంటనే అమలు చేయాలి, నూలు-సిల్క్‌పై 50% సబ్సిడీ, 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, ఉచిత విద్యుత్, జీవిత బీమా, సహకార సంఘాలు బలోపేతం చేయాలి. వెన్ను నొప్పి, కళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. పిల్లల చదువులు ఆపేస్తున్నారు.

చేనేతకు పూర్వవైభవం తీసుకురావాలంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ సంప్రదాయం చరిత్రలో మిగిలిపోతుంది!

The post చేనేత రంగం: కళకళల నుంచి కన్నీళ్ల వరకు appeared first on TelAndra.com.

బులియన్ మార్కెట్‌లో భారీ పతనం
పసిడి మార్కెట్ గత కొన్ని రోజులుగా అద్భుతమైన ఎగురుతున్న ధరలతో ఇన్వెస్టర్లను ఆకర్షించింది. కానీ ఇప్పుడు ఆ ఊపు ఆగిపోయి, భారీ పతనం చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా, స్థానికంగా ఇన్వెస్టర్ల మనసులు గందరగోళంలో పడ్డాయి. జనవరి 30, శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో మార్కెట్ స్థితి చూస్తే, బంగారం ధరలు గణనీయంగా తగ్గగా, వెండి మరింత భయంకరంగా క్షీణించింది. గత 10 రోజులుగా మార్కెట్ ఒక యుద్ధభూమిలా సాగింది. నిన్నటి వరకు 10 గ్రాముల బంగారం రూ.1,80,000 స్థాయిని తాకగా, వెండి కిలో రూ.4.25 లక్షల వద్ద రికార్డు స్థాయికి చేరింది. అయితే ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

డాలర్ బలపడటంతో మార్కెట్ షేక్

గ్లోబల్ మార్కెట్లలో అమెరికన్ డాలర్ ఇండెక్స్ ఆకస్మికంగా బలపడింది. డాలర్ బలంగా ఉండటంతో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకొని డాలర్ వైపు మళ్లారు. ఇది బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపింది.

ట్రంప్ ఫెడ్ నామినేషన్ సంచలనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను నియమించాలని నిర్ణయించారనే వార్తలు మార్కెట్‌ను కుదిపేశాయి. ఫెడ్ స్వతంత్రతపై ఆందోళనలు తగ్గుతాయనే ఆశతో, వడ్డీ రేట్లపై స్పష్టత వచ్చే అవకాశంతో మార్కెట్లు స్పందించాయి. ఇది బంగారం, వెండి ధరలపై భారీ అమ్మకాలకు దారితీసింది.

భారీ లాభ సేకరణతో పతనం

గత కొన్ని రోజుల్లో భారీ లాభాలు గడించిన ఇన్వెస్టర్లు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందనే భయంతో ఒకేసారి విక్రయాలకు దిగారు. దీన్ని తీవ్రమైన లాభ సేకరణ అంటారు. దీంతో ప్రధాన నగరాల్లో ధరలు దారుణంగా పడిపోయాయి. 24 క్యారెట్ల శుద్ధ బంగారం నిన్న రూ.1,78,850 వద్ద ఉంటే, ఇప్పుడు రూ.8,230 తగ్గి రూ.1,70,620కు చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రూ.7,550 తగ్గి రూ.1,63,070 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,65,292 వద్ద ఉండగా, 22 క్యారెట్లు రూ.1,51,523కు కుంగిపోయాయి. వెండి కిలో ధర నిన్న రూ.4.25 లక్షల నుంచి రూ.20,000 నుంచి రూ.50,000 వరకు పడిపోయి, ప్రస్తుతం రూ.3.95 లక్షల నుంచి రూ.4.05 లక్షల మధ్య ఊగిసలాడుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ క్షీణత

అంతర్జాతీయంగా గోల్డ్ ఫ్యూచర్స్ 5.7% తగ్గాయి. ఔన్స్ బంగారం $5,600 నుంచి $5,100 స్థాయికి దిగివచ్చింది. సిల్వర్ స్పాట్ ధరలు 8.4% క్షీణించాయి. ఇది అక్టోబర్ 21 తర్వాత నమోదైన అతిపెద్ద సింగిల్ డే డ్రాప్.

నిపుణుల అంచనా: కరెక్షన్ మాత్రమే

నిపుణులు ఇది కేవలం తాత్కాలిక కరెక్షన్ మాత్రమేనని చెబుతున్నారు. యుద్ధ పరిస్థితులు, ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, మెక్సికోపై ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో బంగారం తిరిగి ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశం. భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. 2026 ఎకనామిక్ సర్వే ప్రకారం ఆహార ధరలు తగ్గినా బంగారం భారం సామాన్యులపై పడుతుంది. RBIకి ఇది కొంత ఊపిరి పోసినట్లే. మొత్తంగా జనవరి 30 బులియన్ చరిత్రలో నల్ల శుక్రవారంగా మిగిలిపోతుంది. ధరల తగ్గుదల సామాన్యులకు సంతోషకరమైనా, మార్కెట్ తీవ్ర అస్థిరతలో ఉంది. రేపు మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుందో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

The post బులియన్ మార్కెట్‌లో భారీ పతనం appeared first on TelAndra.com.

బంగారం, వెండి ధరల దూకుడు: సామాన్యుల ఆందోళన
పెరుగుతున్న బంగారం, వెండి ధరలు సామాన్యులు, మధ్య తరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్ వంటి మహానగరాల్లో వెండి కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. జ్యువలరీ షాపుల వద్ద ‘సిల్వర్ నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. దేశంలో తులం బంగారం ధర లక్షలకు చేరుతుండగా, కిలో వెండి ₹4,15,000 వద్ద ఉంది. నిన్న హైదరాబాద్‌లో ₹4,25,000కు చేరి, ఇవాళ ₹10,000 తగ్గింది. ఢిల్లీలో ఇదే రేట్లు, ముంబై, కోల్‌కతాలో ₹4,10,000.

మార్కెట్ పరిస్థితి :                                                                                                                                                                                                విజయవాడ, విశాఖపట్నంలో కూడా వెండి ధరలు ₹4 లక్షలకు చేరాయి. షాపులు వెలవెలబోతున్నాయి. వ్యాపారులు స్టాక్ లేకపోవడానికి కృత్రిమ డిమాండ్‌ను కారణంగా చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇన్వెస్టర్లు క్యూలలో నిలబడి కొంటున్నారు. బ్యాంకుల్లో గోల్డ్ లోన్లు పెరిగాయి. 10 రోజుల్లో 10 గ్రాముల బంగారం ₹32,000, కిలో వెండి ₹96,000 పెరిగాయి.

పెరుగుదలకు కారణాలు :                                                                                                                                                                                         అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, ఇండస్ట్రియల్ డిమాండ్ (ఈవీ, ఏఐ టెక్నాలజీల్లో వెండి వాడకం) ప్రధాన కారణాలు. స్పెక్యులేషన్, మీడియా ప్రభావం కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. శ్రీనివాస్ గారు చెప్పినట్లు, భవిష్యత్ లాభాల ఆశతో అవసరం లేకున్నా కొనుగోళ్లు పెరిగాయి.

ప్రజలపై ప్రభావం :                                                                                                                                                                                                        మధ్య తరగతి వారు 10 సార్లు ఆలోచించి కొంటున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో ఆభరణాలు కొనలేని పరిస్థితి. వ్యాపారాలు 70-80% తగ్గాయి. కార్మికుల పరిస్థితి దయనీయం. విశాఖలో బ్లాక్ మార్కెట్ మొదలైంది.

భవిష్యత్ అంచనాలు :                                                                                                                                                                                                తులం బంగారం ₹2.5 లక్షలు, కిలో వెండి ₹5-7 లక్షలు దాటవచ్చని ఊహాగానాలు. కానీ, బబుల్ పగిలితే తగ్గే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకోవాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడాలని నిపుణుల సలహా.

The post బంగారం, వెండి ధరల దూకుడు: సామాన్యుల ఆందోళన appeared first on TelAndra.com.

బంగారం ధరల దెబ్బతో ఆభరణాలు పతనం!
బంగారం ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోవడంతో ఆభరణాల కొనుగోళ్ల పై తీవ్ర ప్రభావం పడింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో ఆభరణాల డిమాండ్ 16% క్షీణించింది. రికార్డు స్థాయి గోల్డ్ రేట్లు వినియోగదారులను వెనకడుగు వేయించాయి. అయితే, పెట్టుబడులు సురక్షితమన్న భావనతో ఇన్వెస్ట్‌మెంట్ ఆసక్తి గణనీయంగా పెరిగిందని నివేదిక వెల్లడించింది.

ఈ త్రైమాసికంలో మొత్తం స్వర్ణ కొనుగోళ్లు 209.40 టన్నులుగా నమోదయ్యాయి, గత ఏడాది ఇదే కాలంలో 248.30 టన్నులు ఉండగా. విలువ పరంగా 23% పెరిగి రూ.1,65,380 కోట్ల నుంచి రూ.2,03,240 కోట్లకు చేరింది. ఆభరణాలు 171 టన్నుల నుంచి 31% తగ్గి 117 టన్నులకు పరిమితమయ్యాయి, విలువ రూ.1,14,270 కోట్లుగా స్థిరంగా ఉంది.

పెట్టుబడుల కొనుగోళ్లు 20% పెరిగి 91.66 టన్నులుగా నమోదు కాగా, విలువ 74% జంప్ చేసి రూ.51,080 కోట్ల నుంచి రూ.88,970 కోట్లకు చేరింది. భారత్‌లో 10 గ్రాముల బంగారం సగటు ధర రూ.70,974కు పెరిగింది, గత ఏడాది రూ.66,614తో పోలిస్తే 46% ఎక్కువ. అంతర్జాతీయంగా ఔన్స్ ధర $2,474.3 నుంచి $3,456.50కు ఎగసింది.

దిగుమతులు 37% తగ్గి 308 టన్నుల నుంచి 194 టన్నులకు పడిపోయాయి. 2024లో సుంకం తగ్గింపు వల్ల గతేడాది ఎక్కువ దిగుమతులు జరగడమే ఈ క్షీణతకు కారణం. తొలి 9 నెలల్లో 462 టన్నుల కొనుగోళ్లతో పూర్తి ఏడాది 600-700 టన్నులుగా అంచనా.

ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ 1,313 టన్నులకు పెరిగింది. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, భౌగోళిక అనిశ్చితులు, వాణిజ్య యుద్ధాలు ధరలకు మద్దతిస్తున్నాయి. ముందు రోజుల్లో బంగారం ధరలు బలంగా ఉంటాయని నిపుణుల అంచనా.

The post బంగారం ధరల దెబ్బతో ఆభరణాలు పతనం! appeared first on TelAndra.com.

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
బంగారం ధరలు రోజురోజుకు పెరిగి ఆకాశాన్ని తాకుతున్నాయి. మగువలకు ప్రియమైన పసిడి ధరలు నిలకడగా ఎగసి, సరికొత్త ఆల్‌టైమ్ హై స్థాయిని చేరుతున్నాయి. లక్షన్నరకు చేరువగా పరుగులు పెడుతూ, కొనుగోలుదారులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.

మొదట వెండి ధర లక్ష మార్కును దాటగా, ఆ తర్వాత ఆభరణాల తయారీకి ఉపయోగించే స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి ధర కూడా లక్ష రూపాయలను అధిగమించింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.771 పెరిగి, రూ.10,509 నుంచి రూ.11,280కి చేరుకుంది. ఇది కొనుగోలుదారులకు ఆలోచనకు తావిస్తోంది.

అదే సమయంలో, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.700 పెరిగి, రూ.1,01,300 నుంచి రూ.1,02,000కి చేరుకుంది. ఈ ధరల పెరుగుదల పసిడి పట్ల ఆకర్షణను మరింత పెంచుతోంది, అయితే కొనుగోలు నిర్ణయాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. పసిడి ధరలు ఇంకా ఎంత పెరుగుతాయోనని మార్కెట్ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

The post బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. appeared first on TelAndra.com.

సెప్టెంబర్ 2025: కొత్త మొబైల్ ఫోన్ లాంచ్‌లు
సెప్టెంబర్ స్పెషల్ మంత్

సెప్టెంబర్ 2025లో రాబోతున్న కొత్త మొబైల్ ఫోన్‌లు టెక్ ప్రియులకు ఉత్సాహాన్ని తెస్తున్నాయి. ఈ నెలలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్‌లు సెప్టెంబర్ 13-15 మధ్య జరిగే అవకాశం ఉంది. ఈ సేల్స్‌లో ఫోన్‌లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు లభించనున్నాయి.

ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్

సెప్టెంబర్ 9న ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 17, 17 ఎయిర్, 17 ప్రో, 17 ప్రో మాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 17 ఎయిర్ సన్నని డిజైన్, 2900 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అన్ని మోడల్స్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎ19 (బడ్జెట్), ఎ19 ప్రో (ప్రీమియం) ప్రాసెసర్లు ఉంటాయి. 24 ఎంపీ ఫ్రంట్ కెమెరా ప్రో మోడల్స్‌లో ఉండనుంది. ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 3, వాచ్ 11 సిరీస్, వాచ్ ఎస్ఈ3, వాచ్ అల్ట్రా 3 కూడా లాంచ్ కానున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ

సెప్టెంబర్ మొదటి వారంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ లాంచ్ అవుతుంది. ఇది 4900 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌తో 55,000-60,000 రూపాయల ధరలో లభించనుంది. శాంసంగ్ ఎ17 (ఆఫ్‌లైన్) 15,000-20,000 రూపాయల ధరలో, ఫుల్ హెచ్‌డీ డిస్ప్లేతో వస్తుంది.

వివో, రియల్‌మీ, ఒప్పో

వివో వీ60ఈ 30,000 రూపాయల ధరలో, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో వస్తుంది. రియల్‌మీ 15టీ, 6.5 ఇంచ్ డిస్ప్లేతో 30,000 రూపాయలలో లాంచ్ కానుంది. ఒప్పో ఎఫ్31 సిరీస్ ఆఫ్‌లైన్ మార్కెట్‌లో 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో విడుదల కానుంది.

ముగింపు

సెప్టెంబర్‌లో ఈ ఫోన్‌ల లాంచ్‌లు టెక్ ప్రియులకు ఆసక్తి రేపుతున్నాయి. మీరు ఏ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు? అభిప్రాయాలు పంచుకోండి!

The post సెప్టెంబర్ 2025: కొత్త మొబైల్ ఫోన్ లాంచ్‌లు appeared first on TelAndra.com.

రాజస్థాన్‌లోని జోద్‌పూర్ నానోబాట్‌ స్టార్టప్‌ అంతర్జాతీయ విజయగాథ.
రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌ కు చెందిన నానోబాట్ హౌస్‌వేర్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ విజయగాథ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. ఈ సంస్థ స్టెయిన్లెస్ స్టీల్ వాక్యూమ్ ఇన్సులేషన్ వాటర్ బాటిళ్ల తయారీలో నాణ్యతకు రాజీ పడకుండా, ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందిస్తోంది. విదేశాల్లో కూడా వీటి కోసం డిమాండ్ ఉండటంతో, అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీ పడుతోంది. ఈ విశేషాన్ని గుర్తించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిదాయక ఉదాహరణగా ఎక్స్‌లో ప్రశంసించారు.

నానోబాట్ వ్యవస్థాపకుడు వికాస్ జైన్ 2016లో ఈ ప్రయాణాన్ని ఆరంభించారు. పర్యావరణహిత, అందుబాటు ధరలో ప్రపంచస్థాయి బాటిళ్లు తయారు చేయాలని సంకల్పించి, 2018లో కంపెనీని స్థాపించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడం, భారతీయ సరఫరాదారులకు అండగా నిలవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రారంభంలో 51 మంది సిబ్బందితో మొదలైన ఈ సంస్థ, ప్రస్తుతం 200 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది.

దేశీయ మార్కెట్లతో పాటు, విదేశాలకు కూడా తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ, సంస్థ మరింత విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. వికాస్ జైన్ యొక్క కృషి, దూరదృష్టి, మరియు నాణ్యత పట్ల నిబద్ధతకు కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించారు. భారతీయుల విజయ రహస్యం మంచి ఆలోచన, కష్టపడే మనస్తత్వమని గోయల్ పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా పథకంలో నానోబాట్ ఒక ప్రతిష్టాత్మక ఉదాహరణగా నిలిచింది.

The post రాజస్థాన్‌లోని జోద్‌పూర్ నానోబాట్‌ స్టార్టప్‌ అంతర్జాతీయ విజయగాథ. appeared first on TelAndra.com.

చందానగర్ ఖజానా జ్యువెలరీ లో దోపిడీ.
చందానగర్ ఖజానా జ్యువెలరీ లో దోపిడీ: డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు

చందానగర్‌లో ఖజానా జ్యువెలరీ షాప్‌లో దోపిడీ ఘటన కలకలం రేపింది. మంగళవారం ఉదయం 10:35 గంటలకు ఆరుగురు దుండగులు షాప్‌లోకి చొరబడి, గన్‌తో సిబ్బందిని బెదిరించి లాకర్ కీలు డిమాండ్ చేశారు. కీలు ఇవ్వనందుకు డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్‌పై కాల్పులు జరిపారు, దీంతో అతని కాలికి గాయమైంది. సతీష్ ప్రస్తుతం ప్రమాదంలో లేనట్లు తెలుస్తోంది. దొంగలు సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసేందుకు ఒక షాట్ కాల్చారు.

సుమారు 10 నిమిషాల పాటు షాప్‌లో గందరగోళం సృష్టించిన దుండగులు, సేఫ్ తెరవలేకపోయారు. బయట డిస్‌ప్లేలో ఉన్న కొంత వెండి ఆభరణాలను మాత్రం దోచుకుని, రెండు బైక్‌లపై వికారాబాద్ వైపు పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పరిశీలించి, సీసీటీవీ ఫుటేజ్‌ను సమీక్షించారు. ఈ కేసులో ఏడుగురు దుండగులు పాల్గొన్నట్లు ప్రాథమికంగా తేలింది. నిందితులను పట్టుకునేందుకు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేసి, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు గట్టిచేశారు. క్లూస్ టీమ్‌తో కలిసి ఖాళీ గిల్లీలను విశ్లేషిస్తూ, దర్యాప్తును ముమ్మరం చేశారు.

The post చందానగర్ ఖజానా జ్యువెలరీ  లో దోపిడీ. appeared first on TelAndra.com.