
కేంద్ర మంత్రి కి తృటిలో తప్పిన ప్రమాదం.
సీఎం చంద్రబాబు తో కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ భేటీ :
నిన్న ఆంధ్రప్రదేశ్ ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయం లో సీఎం చంద్రబాబు ని కలిసిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయాల్. పొగాకు, ఆక్వా ,పామ్ఆయిల్ వంటి సమస్యల పై చర్చించారు. అనంతరం గుంటూరు లో ని పొగాకు బోర్డు కార్యాలయం కి వెళ్లారు పీయూష్ గోయాల్. ఆంధ్రప్రదేశ్ పర్యటన లో భాగంగా ఈ రోజు కృష్ణ పట్నం పోర్ట్ ని సందర్శించనున్నారు. అనుకోని సంఘటనల వల్ల పర్యటన రద్దు అయింది.
ఈ రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ వారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కి వెళ్లారు. దర్శనం అనంతరం తిరుపతి నుంచి కృష్ణపట్నంకి హెలికాఫ్టర్ లో వెళ్తుండగా తృటిలో తప్పిన ప్రమాదం. హెలికాఫ్టర్ టేక్ ఆఫ్ సమయం లో సాంకేతిక సమస్య ఏర్పడినట్టు తెలిస్తుంది. ఈ కారణంగా కృష్ణపట్నం పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్. ఏపీ ప్రభుత్వ తరచుగా వాడే హెలికాఫ్టర్ సీఎం చంద్రబాబు గారు ఎక్కువగా ఆ హెలికాఫ్టర్ లో నే ప్రయాణిస్తుంటారు. చంద్రబాబు వాడే హెలికాఫ్టర్ కావడం తో పీయూష్ గోయాల్ కి కేటాయించారు. ఏపీ ప్రభుత్వ మంత్రులు వీవీఐపీ లు వాడే హెలికాఫ్టర్ లో తరచు సాంకేతిక లోపాలు తెలెత్తడం తో అప్రమత్తం ఐన అధికారులు. హెలికాఫ్టర్ లో టెక్నికల్ సెక్యూరిటీ సమయాల పై వెంటనే నివేదిక ఇవ్వాలి అని ఇంటిలెజెన్స్ ని ఆదేశించిన ఏపీ డీజీపీ.