Headlines
simhachalam

సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం లో అపశృతి.

ఏప్రిల్ ౩౦ బుధవారం మధ్యాహ్నం సింహాచలం లో అప్పన్న స్వామి చందనోత్సవం లో, సిమెంట్ గోడ కూలడం తో ఏడుగురు మరణించారు, ఆరుగురు గుడి దగ్గరే మరణించగా ఒక్కరు చికిత్స పొందుతూ మరణించారు, ఈ ఘటన లో 15 మందికి పైగా గాయపడ్డారు.

రెవిన్యూ శాఖ మంత్రి సత్య ప్రసాద్ గారు సంఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్నారు, అయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జరిగే చందనోత్సవం లో కూడా ఇలాంటి అపశృతులు జరిగేవి కానీ ఇంత ప్రాణ నష్టం ఉండేది కాదని అన్నారు.

దీని పై ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారు స్పందిస్తూ ‘ఈ సంఘటన నన్ను కలిచి వేసింది. భారీ వర్షాల కారణంగా కూలిన గోడ వల్ల మరణించిన వారి కుటుంబాలకు నేను నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని అన్నారు.

అక్కడి పరిస్థితి ఫై జిల్లా కలెక్టర్ తో ఆయన మాట్లాడారు గాయపడ్డవారికి చికిత్స అందించమని ఆదేశించారు. ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంటానూ అని తెలిపారు.

ఈ సంఘటన ఫై మాజీ ముఖ్య మంత్రి జగన్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం జరిగిందాని గురించి పశ్చాతాపం చెందకుండా తాను పెట్టిన టికెట్ సిస్టం వల్ల వచ్చిందని అంటున్నారు అని అన్నారు.

70 అడుగుల పొడవు , 20 అడుగుల ఎత్తు గల గోడను నిర్మించడానికి ఒక టెండర్ కూడా లేకుండా కట్టారు అని. దాని నిర్మాణంలో నాణ్యత  లేని సిమెంట్ వాడడం తో పాటు ఎటువంటి కాలమ్స్ ఏర్పాటు చేయకుండా నే కేవలం మంత్రుల పర్యవేక్షణ లో నాలుగు అంటే నాలుగే రోజులో పూర్తి చేసారు అని.

ap incident

వారు చేసిన నిర్లక్ష్యని కప్పి పుచ్చుకోడానికి జగన్ ఏర్పాటు చేసిన టికెట్ సిస్టం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని అనడం ఎంతవరకు సబవు అని అన్నారు.

మరి ప్రతి ఏడాది ఇలా ఏమి జరగడం లేదు కదా అని మరియు మొన్నటికి మొన్న తిరుపతిలో వైకుంఠ దర్శనం లో జరిగిన తొక్కిసలాట కూడా వారి భద్రతా లోపం వల్ల జరిగిందని కాని అది కూడా జగన్ పెట్టిన క్యూ సిస్టమ్ వల్లే జరిగింది అని చేప్తారు అని జగన్ గారు అన్నారు.

ఈ ప్రభుత్వం వాళ్ళ సిస్టం ఫెయిల్ అయినప్పుడు కూడా జగన్ వల్లనే జరిగాయి అని చెప్పడం సభవు కాదు అని మీడియా ముందు కూటమి ప్రభుత్వం పై జగన్ గారు మండిపడ్డారు.