
ప్రధాని మోదీ సమక్షంలో యోగాంధ్ర-2025
ప్రధాని మోదీ సమక్షంలో యోగాంధ్ర-2025 :
ఈ రోజు విశాఖ లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఈ నెల 21 న 11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భాంగా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం. యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ గారు, ప్రధాని వస్తున్న కారణంగా స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం చంద్ర బాబు నాయుడు గారు. ఆర్.కే బీచ్ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్లు 240 యోగ కంపార్టుమెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి బ్లాక్ కి 1000 మంది ని ఏర్పాటు చేస్తూ ప్రతి 1000 మంది కి ఒక యోగ ట్రైనర్ ని నియమిస్తున్నారు.
ఈ ఈవెంట్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి యోగ మాట్ టీషీర్ట్ యోగ కిట్ ని అందచేస్తున్న ఏపీ ప్రభుత్వం. ప్రధాని మోడీ యోగ చేసే ప్రధాన వేదిక ని స్వయంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు, VIP ల భద్రత కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని స్వయంగా తెలుసుకున్నారు. యోగాంధ్ర కార్యక్రమం గురించి మంత్రులతో మరియు అధికారుల తో నోవొటెల్ హోటల్ లో సమీక్షా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐదు లక్షల మంది తో నిర్వహించి రికార్డు సృష్టించాలని ఏపీ ప్రభుత్వం రికార్డ్స్ నెలకొల్పాలని భావిస్తుంది. ఈ యోగ దినోత్సవ కారక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.