Headlines
ANDHRA PRADESH CM

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు శుభవార్త.

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు గుడ్ న్యూస్! రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15, స్వాతంత్ర దినోత్సవం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందించనుంది. కర్నూలు పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సంచలన ప్రకటన చేశారు. “మా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం త్వరలోనే అమలు చేస్తాం. అవసరమైతే ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఈ పథకాన్ని ప్రారంభిస్తాం,” అని సీఎం స్పష్టం చేశారు.

ANDHRA PRADESH RTC LOGO

ఈ నిర్ణయం రాష్ట్రంలోని మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ప్రభుత్వం, ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భారం తగ్గించి, వారి ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ పథకం ఎలా ఉపయోగపడనుంది?

ఉచిత బస్సు పథకం మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని, ప్రయాణ సౌలభ్యాన్ని అందించడమే కాక, నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ వారి చలనశీలతను పెంచుతుంది. ప్రత్యేకించి, విద్యార్థినులు, ఉద్యోగినులు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మహిళలు ఈ సౌకర్యాన్ని ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది.అయితే, ఈ పథకం అమలులో బస్సుల ఫ్రీక్వెన్సీ పెంచడం, సీట్ల కేటాయింపు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కొందరు సూచించారు.

ANDHRA PRADESH RTC BUS

సానుకూల స్పందనతో మహిళల ఆనందం

“ఈ నిర్ణయం చాలా సానుకూలమైనది. ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. సుదూర ప్రయాణాలు చేసే వారికి, నగరంలో తిరిగే వారికి ఇది ఎంతో ఉపయోగకరం,” అని మరో ప్రయాణికురాలు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహిళల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.

ఈ పథకం అమలుతో ఆంధ్రప్రదేశ్‌లో మహిళల సాధికారత, ఆర్థిక స్వాతంత్ర దిశగా మరో అడుగు వేసినట్లు అవుతుంది. ఆగస్టు 15 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది కాబట్టి, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.