Kurnool Bus Accident

కర్నూలు బస్సు దగ్దం: మృతదేహాల గుర్తింపు పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని వేదనను నింపింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (డీడీ01ఎన్9490) చిన్నటేకూరు సమీపంలో బైక్‌తో కలుసి ప్రమాదానికి గురైంది. బస్సు కిందికి వెళ్లిపోయిన బైక్ ఆయిల్ ట్యాంక్‌ను తాకడంతో మంటలు చెలరేగి, లగేజీ క్యాబిన్‌లో ఉన్న వందల మొబైల్ ఫోన్లు పేలడంతో దగ్దం తీవ్రమైంది. ఫలితంగా 19 మంది సజీవ దహనమయ్యారు. బస్సులో 34 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉండగా, 21 మంది అదృష్టవశాత్తు బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు.

ఇప్పుడు మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. డీఎన్ఏ టెస్టులతో 18 మృతదేహాల వివరాలు ఇప్పటికే తెలిసాయి. మిగిలిన 19వ మృతదేహం చిత్తూరు జిల్లా చెందిన వ్యక్తి ది. ఆయన బంధువులు శనివారం సాయంత్రం చేరి శాంపిల్స్ ఇచ్చారు. రిపోర్టు వచ్చిన తర్వాత అందరి మృతదేహాలు హ్యాండ్ ఓవర్ చేస్తారు. “గుర్తించని డెడ్ బాడీకి బంధువులు వచ్చారు. పూర్తి క్లారిటీ రేపు వస్తుంది” అని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటీల్ తెలిపారు.

మృతదేహాలను తరలించేందుకు 19 అంబులెన్సులు, ఫ్రీజర్ బాక్సులతో సిద్ధం చేశారు. పోస్ట్‌మార్టం, ఎఫ్‌ఐఆర్, ఇంక్వెస్ట్ డాక్యుమెంట్లతో పాటు అన్నీ ఏర్పాటు. ప్రమాదానికి మద్యం కారణమని పోలీసులు నిర్ధారించారు. రోడ్డుపై పడిపోయిన బైకర్ శివశంకర్‌కు ఎఫ్ఎస్‌ఎల్ రిపోర్టు పాజిటివ్. బస్సు డ్రైవర్ కూడా మద్యం సేవించాడు. బైకర్లు మొదట స్లిప్ అయి పడి, ఆ తర్వాత బస్సు వారిని హిట్ చేసుకుని అగ్నిప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో తెలిసింది. బైకర్లకు సెపరేట్ ఎఫ్‌ఐఆర్ నమోదు.

ప్రమాదానికి గురైన కర్నూలు బస్సు మీద 16 చలాన్లు, రూ.23,120 ఫైన్లు పెండింగ్. ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ ముగిసినా ప్రయాణించాయి. కలెక్టర్ డా.ఏ.సిరి బాధితులకు పరిహారం, సహాయాలు ప్రకటించారు. ఈ ఘటన రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.