COOLIE

కూలీ సినిమా సమీక్ష: రజినీ స్టైల్, లోకేష్ మార్క్ మిస్సింగ్

కూలీ సినిమా సమీక్ష: రజినీ స్టైల్, లోకేష్ మార్క్ మిస్సింగ్

రజినీకాంత్–లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్ ‘ కూలీ ’తోనే హైప్ పెరిగింది. అయితే ట్రైలర్ మామూలుగానే ఉన్నా, బుకింగ్స్ మాత్రం ఫుల్. ఈ నేపథ్యంతో విడుదలైన సినిమా యాక్షన్ ఎంటర్టైనర్‌గా వచ్చింది.

కథా స్క్రీన్‌ప్లేలో లోకేష్ సిగ్నేచర్‌ ఎమోషనల్ హై, ఫ్రెష్‌నెస్ మిస్సయ్యాయి. ఎక్కువ భాగం రజినీ ఆరాపైనే నడిచింది. యాక్షన్, పాటలలో రజినీ స్టైల్ బాగా ఆకట్టుకున్నా, కథలో కొత్తదనం తక్కువ. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో రజినీ వింటేజ్ లుక్ హైలైట్‌గా నిలిచింది.

నాగార్జున ఎంట్రీ మొదట ఆసక్తికరంగా ఉన్నా, సెకండ్ హాఫ్‌లో అతని పాత్ర పాసివ్‌గా మారింది. షౌబిన్ సాహీర్ లేయర్డ్ క్యారెక్టర్‌తో బలమైన ఇంపాక్ట్ ఇచ్చాడు. అమీర్ ఖాన్ చివర్లో తక్కువ సమయంలోనే ఆకట్టుకున్నాడు. ఉపేంద్ర పాత్ర రజినీకి తోడుగా నిలిచింది. రచితా రామ్ షాకింగ్ మేకోవర్‌తో సర్ప్రైజ్ ఇచ్చింది.

అనిరుధ్ ఆల్బమ్ సగటుగా ఉన్నా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో మంచి వర్క్ చేశాడు. కానీ రొటీన్ కథనం, స్లో సెకండ్ హాఫ్, ఎక్కువ లెంగ్త్ సినిమాకి మైనస్ పాయింట్స్ అయ్యాయి.

మొత్తానికి, ‘కూలీ’లో రజినీ స్టైల్ ఉన్నా, లోకేష్ మార్క్ మిస్సవడంతో ఇది “జస్ట్ ఓకే” అనిపించే సినిమా.