పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అంకంరెడ్డి ఆగ్రహం.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అంకంరెడ్డి ఆగ్రహం – తాడేపల్లిలో కేసు నమోదు :
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేసిన వైసీపీ నేత నారాయణ మూర్తి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. నిన్న జరిగిన హరి హర వీర మల్లు సక్సెస్ మీట్ లో పవన్ మాట్లాడాడుతూ అభిమానులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసారని వైసీపీ నేతలు వారి పై కేసు ను నమోదు చేశారు.
వైసీపీ నేత నారాయణ మూర్తి మాట్లాడుతూ – ఫాన్స్ ను రెచ్చగొట్టేలా మాట్లాడారు, కొట్టేయండి నమిలేయండి మీకు నచ్చినట్టు చేయండి అంటూ వారు అన్న మాటలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఫిర్యాదు లో పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం వ్యాఖ్యల వల్లే జనసేన నాయకులూ వైసీపీ నేతల కార్ల మీద దాడి చేశాడంటూ YCP నేతలు ఆరోపించారు. వారు ఇలా మాట్లాడటం వైసీపీ నేతలను అవమానించారని దీనికి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు.
తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ని స్వీకరించినప్పటికీ కేసు ను నమోదు చేసారా లేదా అన్న దాని పై స్పష్టత లేదు. గతం లో కూడా వైసీపీ నాయకులూ పవన్ కళ్యాణ్ పై వివిధ సందర్బాల్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా రాజకీయ విమర్శలు, కేసులు కొనసాగుతూనే ఉన్నాయి.