హరి హర వీరమల్లు – పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా విజువల్ ట్రీట్.
హరి హర వీరమల్లు – పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా విజువల్ ట్రీట్:
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీర మల్లు’ భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత, డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రం హరి హర వీరమల్లు కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, విడుదల తర్వాత సినిమాపై మిశ్రమ స్పందనలు వచ్చాయి.
మొదటి సగంలో పవన్ కళ్యాణ్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆయన పరిచయ సన్నివేశం, కుస్తీ యాక్షన్ సీన్స్, ఎలివేషన్ షాట్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి.

ఎం.ఎం. కీరవాణి సమకూర్చిన సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచింది, ముఖ్యంగా పవన్ ఎలివేషన్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు.
మొదటి సగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అయితే, ఇంటర్వెల్ తర్వాత కథ నెమ్మదిగా సాగింది. కథనం లాగినట్లు అనిపించడంతో పాటు క్లైమాక్స్ బలహీనంగా ఉందని అభిమానులు భావించారు.
విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కూడా నీరసంగా ఉన్నాయి, కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ పాతబడినట్లు కనిపించాయి.అయినప్పటికీ, కథ బాగున్నప్పటికీ దర్శకుడు పవన్ కళ్యాణ్‌ను మరింత ఆకర్షణీయంగా చూపించడంలో విఫలమయ్యాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మిశ్రమ సమీక్షలు ఉన్నప్పటికీ, హరి హర వీర మల్లు మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద బలమైన కలెక్షన్లతో విజయవంతంగా రాణించింది.