అలస్కా లో భూకంపం, సునామి వస్తుందంటూ హెచ్చరిక
అలస్కా లో భూకంపం, సునామి వస్తుందంటూ హెచ్చరిక :
జులై 16 2025 న అమెరికా లో భూకంపం సంభవించింది. అలస్కా ప్రాంతం లో 7 . 3 తీవ్రత తో కూడిన భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంపం అలస్కా లో ని సాండ్ పాయింట్ తీరానికి 87 కిలోమీటర్ల దూరం లో సంభవించింది.
ఈ భూకంపం కారణంగా సునామి హెచ్చరికలు జారీ చేసారు.
భూకంపం వల్ల భారీ కెరటాలు రావడం తో సునామి వస్తుందని అంచనా తో హెచ్చరికలు జారీ చేయగా కొన్ని గంటలకి స్వల్ప కెరటం నమోదవ్వడం తో సునామి హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.

సాండ్ పాయింట్ దగ్గర 3 అంగుళాల సునామి కెరటం నమోదయ్యింది, అందుకే సునామి హెచ్చరిక జారీ చేసారు. కానీ కొన్ని గంటలకి అంత కుదుట పడటం తో సునామి హెచ్చరిక ను రద్దు చేసారు.
అమెరికా లో సంభవించిన భూకంపం వల్లఎటువంటి ప్రాణ నష్టం గని ఆస్తి నష్టం జరగలేదు అని స్పష్టం చేసారు.
అలస్కా ‘రింగ్ అఫ్ ఫైర్’ ప్రాంతం లో తరచు భూకంపాలు నమోదవ్వడం సాధారణ విషయం అని అధికారులు వెల్లడించారు.